Fri Apr 03 2026 20:55:57 GMT+0530 (India Standard Time)
14 రీల్స్ కి జాక్ పాట్

మహేష్ బాబు - శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కిన 'దూకుడు' చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మించింది. ఆ సినిమాతో దర్శకుడు శ్రీను వైల్ట, హీరో మహేష్, నిర్మాణ సంస్థ 14 రీల్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ ఒక్క సినిమా విజయంతోనే 14 రీల్స్ సంస్థ పెద్ద నిర్మాణ సంస్థగా మారిపోయింది. తర్వాత 14 రీల్స్ నిర్మాణంలోనే మహేష్ 'ఆగడు', '1 నేనొక్కడినే' వంటి చిత్రాల్లో నటించాడు. ఇక ఆ రెండు చిత్రాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఈ చిత్రాలతో 14 రీల్స్ ఆర్థిక ఇబ్బందులకు తలొగ్గి చిన్న హీరోలతో సినిమాలను నిర్మించడం మొదలెట్టింది
నాని తో 'కృష్ణ గాడి వీర ప్రేమగధ' చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ నిర్మాతలు ఆ సినిమాతో గట్టెక్కినా... మొన్నీమధ్యనే విడుదలైన నితిన్ తాజా చిత్రం 'లై 'తో ఘోర పరాజయం చవిచూడడమే కాక 14 రీల్స్ నిర్మాణ సంస్థ ఆర్ధిక కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే మహేష్ మాత్రం తన మాతృ సంస్థ నష్టాల్లో ఉంటె చూడలేక... 14 రీల్స్ ని ఆదుకునేందుకు ముందుకు వచ్చినట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ సంస్థ తదుపరి చిత్రం మహేష్ బాబుతో ఉండబోతోందని టాక్ స్ప్రెడ్ అయ్యింది.
అయితే ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. లాభాలు వస్తే అందులో వాటా మాత్రం తీసుకుంటాడని వినికిడి. ఇక మహేష్ ఇచ్చిన భరోసాతో 14 రీల్స్ సంస్థ మంచి కథతోపాటే దర్శకుల వేటలో పడిందంటున్నారు.
- Tags
- 14 రీల్స్
Next Story

