Wed Dec 24 2025 20:06:24 GMT+0000 (Coordinated Universal Time)
అడ్వాన్స్ కోటి ఇచ్చిన హీరోతోనే తగాదా పెట్టుకున్న డైరెక్టర్

మారుతి మీద తొలినుంచి బూతు డైరెక్టర్ అనే ముద్ర పడిపోయింది. భలే భలే మగాడివోయ్ చిత్రం తో ఆ బూతు పేరును చేరిపేసుకుని స్టార్ డైరెక్టర్ హోదా పై కూర్చున్నాడు. ఇక వెంటనే వెంకటేష్ వంటి స్టార్ హీరోతో బాబు బంగారం తీసి మళ్ళీ ప్లాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే మారుతీ బాబు బంగారం చిత్రం తర్వాత ఒక హీరో తో సినిమా చెయ్యడానికి కమిట్ అయ్యాడని .... ఇక ఆ సినిమాకి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. ఆ హీరో ఎవరో కాదు ‘నువ్విలా’ సినిమా ఫేమ్ హవీశ్. హవీష్ తో సినిమా చెయ్యడానికి కమిట్ అయిన మారుతీ ఇప్పుడు ఆ చిత్రం చెయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదట.
మారుతీ తన సినిమా చెయ్యడానికి వెనక్కి తగ్గడం తో హవీష్ మారుతీ తో గొడవ పడినట్లు వార్తలొస్తున్నాయి. ఈ గొడవ కూడా నిన్న(మంగళవారం) రాత్రి జరిగిందని... ఆ గొడవ తార స్థాయిలో జరిగిందని అంటున్నారు. మారుతీ హవీష్ తో సినిమా చెయ్యడానికి ఒప్పుకుని అడ్వాన్స్ గా 1 కోటి తీసుకున్నాడని.... ఇప్పుడు సినిమా చెయ్యక పోగా అడ్వాన్స్ తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని... ఈ విషయం మూలంగానే గొడవ జరిగిందని అంటున్నారు. ఇక ఈ గొడవలో నువ్వెంత అంటే నువ్వెంత అన్నస్థాయికి వెళ్లిందట. మోసగాళ్లకి మోసగాడు అంటూ మారుతిని హవీష్ ఆరోపించగా, వెంటపడేవాడు హీరో కాదంటూ మారుతి కౌంటర్ ఇచ్చాడట! ఇక మారుతీ నాకు వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల నీ సినిమా లేట్ అవుతుందని హవీశ్ ని మభ్యపెట్టడం తోనే ఈ గొడవ జరిగిందని అంటున్నారు.
ఎలాగైనా మారుతీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తే తన పేరు ఇండస్ట్రీలో వినబడుతుందని భావించి అతను ఏకం గా కోటి అడ్వాన్స్ ఇచ్చాడని కానీ మారుతి కి హవీశ్ తో చెయ్యడం ఇష్టం లేక సినిమాని వాయిదా వేస్తున్నాడని అంటున్నారు. కానీ హవీష్ మాత్రం మారుతీ సినిమా కోసం వేరే సినిమాలు ఒప్పుకోకుండా వెయిట్ చేస్తూ టైం వృధా చేసుకున్నాడని అతని సన్నీహితులు చెబుతున్నారు.
Next Story

