10 వ తేదీ మెగా మరియు అక్కినేని అభిమానులకి ప్రత్యేకం

ఈ నెల 10 వ తేదీన విడుదల కానున్న అజ్ఞ్యాతవాసి చిత్రం కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి ఘోరమైన పరాజయాల అనంతరం వారి ఆకలి తీర్చే చిత్రం అవుతుందనే ఆశతో పడిగాపులు కాస్తున్న పవర్ స్టార్ అభిమానులకి కౌంట్ డౌన్ దగ్గర పడింది. మరో వైపు అదే రోజున తన తదుపరి చిత్ర వివరాలు ప్రకటించనున్న అఖిల్ అక్కినేని చెప్పబోయే వార్త కోసం అక్కినేని వారి అభిమానులు నిరీక్షిస్తున్నారు.
అఖిల్ తొలి చిత్రానికి హలో కి మధ్య ఎక్కువ గ్యాప్ సంతరించుకుంది. కానీ హలో తరువాత వెంట వెంటనే చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నాడు యువ హీరో. అయితే ఇప్పటికే అఖిల్ మూడవ చిత్రం కోసం దర్శక రచయిత కొరటాల శివ నుంచి ఒక ప్రతిపాదన తోపాటు 'మలుపు' చిత్రాన్ని రూపొందించిన సత్య పినిశెట్టి నుంచి డిఫరెంట్ లవ్ స్టోరీ తో తయారు చేయబడ్డ స్క్రిప్ట్ ఒకటి అఖిల్ వద్ద వున్నాయట. మరి వీటిలో ఏ ప్రాజెక్ట్ కి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో? ఈ రెండు కాక మరేదైనా డిఫరెంట్ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడా అనే విషయం పై బుధవారం స్పష్టత ఏర్పడనుంది.

