Tue Dec 09 2025 08:36:09 GMT+0000 (Coordinated Universal Time)
Akhanda 2 : అఖండ 2 మూవీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త అందింది. అఖండ 2 తాండవం విడుదలకు లైన్ క్లియర్ క్లియర్ అయింది

నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త అందింది. అఖండ 2 తాండవం విడుదలకు లైన్ క్లియర్ క్లియర్ అయింది. డిసెంబర్ 12వ తేదీన అఖండ 2 తాండవం విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 నుంచి ప్రీమియర్ షోలు వేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 6వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా అఖండ 2 మూవీ విడుదల కావాల్సి ఉంది.
సాంకేతిక కారణాలతో...
అయితే సాంకేతిక కారణాలను చూపి నిర్మాతలను ప్రీమియర్ షో ల నుంచి సినిమా వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బాలయ్య బాబు అభిమానులు తీవ్ర నిరాశలో పడిపోయారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ఓకే చెప్పారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, తమన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
Next Story

