Fri Dec 05 2025 12:24:48 GMT+0000 (Coordinated Universal Time)
ఆచార్య నుంచి " శానా కష్టం నీతో ".. ఫుల్ సాంగ్ రిలీజ్
మేకర్స్ శానాకష్టం నీతో మందానికి అనే పార్టీ సాంగ్ ని విడుదల చేయగా.. ఈ పాటలో చిరుతో కలిసి రెజీనా స్టెప్పులేసింది. మణిశర్మ సంగీతంతో.. మాస్ లిరిక్స్ తో చిరు ఊరమాస్ స్టెప్పులు అదిరిపోయాయి.

మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా.. ఇప్పటి వరకూ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను, మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఆచార్య నుంచి మూడవ పాటను విడుదల చేశారు మేకర్స్. శానాకష్టం నీతో మందానికి అనే పార్టీ సాంగ్ ని విడుదల చేయగా.. ఈ పాటలో చిరుతో కలిసి రెజీనా స్టెప్పులేసింది. మణిశర్మ సంగీతంతో.. మాస్ లిరిక్స్ తో చిరు ఊరమాస్ స్టెప్పులు అదిరిపోయాయి.
Also Read : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి.. !
ఈ పాటకు వాయిస్సే హైలెట్ అని చెప్పాలి. రేవంత్, గీతామాధురిల హస్కీ వాయిస్ పాటను మరో రేంజ్ లో నిలబెట్టింది. ఇవాల్టి నుంచి ఈ పాట ప్రతి పార్టీలోనూ వినిపిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. కొణిదల ప్రొడక్షన్స్ ద్వారా రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.
News Summary - Sana Kastam neetho Mandakini lyrical video out from acharya
Next Story

