హెబ్బా కాస్త ఆలోచించు

కుమారి 21 ఎఫ్ తో ఒక్కసారిగా ఫెమ్ లోకొచ్చిన హీరోయిన్ హెబ్బా పటేల్.. ఆతర్వాత రాజ్ తరుణ్ తో కలిసి నటించిన సినిమాలు తప్ప ఆమెకి పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో అసలు అవకాశాలే రాలేదు. అయితే హెబ్బా కి ఈ మధ్యన అసలు అవకాశాలే రావడం లేదు. అటు తమిళంలో అయినా పాగా వేద్దామనుకుంటే అర్జున్ రెడ్డి పోరి షాలిని పాండే హెబ్బకి వచ్చిన అవకాశాన్ని తన్నుకుపోయింది. యూత్ కి బాగా కనెక్ట్ అయిన హెబ్బా కి ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేవు. గత ఏడాది వచ్చిన ఏంజిల్ సినిమాతో హెబ్బకి వచ్చే అవకాశాలు కూడా పోయాయి.
ఆ సినిమా హిట్ అవ్వకపోగా... హెబ్బా పటేల్ అవకాశాలకు కూడా చెక్ పెట్టింది. అవకాశాలు లేక ఖాళీగా ఉన్న హెబ్బా మళ్ళీ నాగ్ అన్వేష్ తో సినిమా చెయ్యడానికే రెడీ అవుతుంది. ఏంజిల్ లో నాగ్ అన్వేష్ తో కలిసి నటించిన హెబ్బా పటేల్ మళ్ళీ ఇప్పుడు నాగ్ అన్వేష్ తో కలిసి మరో సినిమా చెయ్యడానికి సిద్దమయ్యింది. ఈ సినిమాతో అయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకుని... అవకాశలతో దూసుకుపోవాలని చూస్తుంది. మరి చిన్న హీరోతో మళ్ళీ జత కట్టి నిలదొక్కుకోవాలని ఆశ హెబ్బకి అత్యాశే అవుతుందేమో.
మరి హెబ్బాకి హిట్స్ లేక ఆ డిప్రెషన్ లో అందం మీద, ఫిట్నెస్ మీద కాన్సంట్రేషన్ తగ్గించేసిందేమో. ఇప్పుడు హెబ్బా బ్యూటీ మీద బయట చాలా కామెంట్స్ వినబడుతున్నవి. మరి అవకాశాల కోసమైనా హెబ్బా కాస్త బ్యూటీ మీద ఫోకస్ పెడితే మీడియం హీరోల పక్కన అయినా కాస్త ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. లేకుంటే బరువు పెరిగితే ఆ వచ్చే అవకాశాలు కూడా రావు.

