హెబ్బకి 'అబ్బా' అనే ఆఫర్ తగిలిందిగా

'కుమారి 21 ఎఫ్' తో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగి పోయిన హెబ్బా పటేల్ కి రాజ్ తరుణ్ తో కలిసి నటించిన సినిమాలన్నీ మంచి పేరునే తెచ్చిపెట్టాయి. అయితే అమ్మడుకి రాజ్ తరుణ్ తో కలిసి వచ్చినట్టు మరె ఇతర హీరో అంటే వరుణ్ తేజ్ కి జోడిగా నటించిన 'మిష్టర్' డిజాస్టర్. అలా హెబ్బా పటేల్ ఇప్పుడు 'ఏంజిల్' సినిమాలో నటించింది. ఆ సినిమా విడుదల కష్టాలు ఎదుర్కొంటుంది. అయితే హెబ్బా అందాలకు మంచి పేరొచ్చినా పెద్ద స్టార్స్ పక్కన మాత్రం సరైన ఆఫర్స్ మాత్రం రాలేదు. ఇక్కడ టాలీవుడ్ లో ప్రస్తుతం 'ఏంజిల్' తప్ప హెబ్బా చేతిలో మరే ఇతర సినిమా లేదు.
ఇకపోతే హెబ్బకి కోలీవుడ్ లో అబ్బా అని అదిరిపోయే ఆఫర్ ఒకటి తగిలిందట. అక్కడ తమిళంలో ఆరంభమే అదరగొట్టే ఛాన్స్ ను ఒడిసిపట్టుకుందని సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో ఇలయదళపతి విజయ్ సరసన అవకాశం అందుకుందని వార్తలు ఎప్పటినుండో కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే హెబ్బా పటేల్ కి మాత్రం విజయ్ పక్కన బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగానే చెబుతున్నారు. ఓ క్రేజీ మూవీలో విజయ్ పక్కన కుమారి హెబ్బా ఛాన్స్ అందుకుందని కోలీవుడ్ నుంచి సమాచారం అందుతుంది.
అయితే విజయ్ ప్రస్తుతానికి తన తాజా చిత్రంలో సమంత, కాజల్ వంటి హీరోయిన్స్ తో జోడి కడుతున్నాడు. మరి ఆ తర్వాత మురుగదాస్ చిత్రంలో విజయ్ నటిస్తాడంటున్నారు గాని అక్కడా అక్లారిటి లేదు. ఇక ఏ చిత్రంలో విజయ్ సరసన హెబ్బా పటేల్ ఛాన్స్ దక్కించుకుంది అనే విషయము అధికారింగా తెలియాల్సి ఉంది.