హీరో కన్నాముందే హీరోయిన్స్ ని ఎంపిక చేస్తాడట!

ఈ ఏడాది జూన్ లో విడుదలైన దువ్వాడ జగన్నాధం కలెక్షన్స్ పరంగా ఒకే అనిపించినా టాక్ పరంగా యావరేజ్ హిట్ అందుకుంది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ మాత్రం మా సినిమా సూపర్ హిట్ అంటూనే ఉన్నాడు. అలాగే నిర్మాత దిల్ రాజు కూడా తమ డీజే సినిమా హిట్ అనుకుంటూనే ఉన్నారు. ఆ సినిమా హిట్ అవడంతో హరీష్ శంకర్ ఇప్పుడు తన తదుపరి చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. హరీష్ తన తదుపరి చిత్రాన్ని కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్న హరీష్ ఈ సినిమా కోసం నటీనటుల ఎంపికపై దృష్టి సారించాడట.
అయితే ఈ సినిమాకి ఇంకా హీరో ని ఫైనల్ చెయ్యని హరీష్ శంకర్ మొదట హీరోయిన్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడట. అయితే హరీష్ డైరెక్ట్ చెయ్యబోయే ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ కి ఛాన్స్ ఉందట. అయితే ఆ ఇద్దరు హీరోయిన్స్ లో మెయిన్ హీరోయిన్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని అనుకుంటుండగా సెకండ్ హీరోయిన్ కోసం సాయి పల్లవి ని తీసుకునే ఆలోచనలో హరీష్ శంకర్ ఉన్నాడని తెలుస్తుంది. మరి సాయి పల్లవి సెకండ్ హీరోయిన్ గా ఒప్పుకుంటుందో లేదో తెలియదు గాని .... హరీష్ శంకర్ మాత్రం ఈ ఇద్దరు హీరోయిన్స్ ని ఫైనల్ చేసాక హీరో ని ఫైనల్ చేస్తాడట.
మరి ప్రస్తుతానికి స్పైడర్, ఖాకి సినిమాల తర్వాత ఖాళీగా ఉంటున్న రకుల్ ప్రీత్ సింగ్, రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ లో హీరోయిన్ గా నటించబోతుంది అనే వార్తలు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నాయి. అలాగే సాయి పల్లవి కూడా ప్రస్తుతానికి ఎంసీఏ సినిమాలో నటిస్తుండగా... ఆ సినిమా విడుదకు సిద్ధంగా ఉంది.

