హీరో కంటే విలన్ బెటర్!!

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన స్పైడర్ సినిమా ఫైనల్ గా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఫస్ట్ లోక్ దగ్గరనుండి, టీజర్స్, ట్రైలర్ వరకు ఎంతో తాత్సారం చేసిన దర్శకుడు మురుగదాస్ స్పైడర్ విడుదలను మాత్రం అనుకున్న టైమే కే విడుదల చేయగలిగాడు. అయితే స్పైడర్ చూసిన ప్రేక్షకులంతా స్పైడర్ లో హీరో కంటే విలన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందంటున్నారు. మహేష్ బాబు హీరో గా నటించిన ఈ సినిమా లో విలన్ పాత్రలో దర్శకుడు, నటుడు అయిన ఎస్ జే సూర్య నటించాడు. అయితే ఇప్పుడు స్పైడర్ సినిమాకి ఎస్ జే సూర్య నటన పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు.
సైకిక్ పాత్రలో......
స్పైడర్ సినిమా వీక్షించి థియేటర్ నుంచి బయటకి వస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఎస్ జే సూర్య కనబరిచిన నటనకి ఫిదా అయిపోయారు. ఇందులో ఎస్ జే సూర్య ఒక సైకిక్ పాత్ర లో నటించాడు. సినిమా చూసిన ప్రేక్షకులంతా సినిమాలో ఏది బాగుంది అంటే మొదటగా ఎస్ జె సూర్య నటననే చెబుతున్నారు. రెగ్యులర్ విలన్లలా కాకుండా ఆయన కనబర్చిన కొత్త బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, పేస్ ఎక్స్ ప్రెషన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. విమర్శకులు కూడా ఎస్ జే సూర్య నటనకి వందకి వంద మార్క్ లు వేస్తున్నారు.
విలన్ పాత్రనే హైలెట్.....
అసలు హీరో పాత్రను ఎలివేట్ చెయ్యాల్సిన మురుగదాస్ ఇలా ఈ విలన్ సైకిక్ పాత్ర కోసం స్క్రిప్ట్ పరంగా చాలా కష్టపడ్డాడట. విలన్ పాత్రని అత్యంత అద్భుతంగా తీర్చి దిద్దాడు. ఇకపోతే ఈ సినిమా తరువాత ఏ జే సూర్య విలన్ గా మరిన్ని అవకాశాలు తన్నుకోస్తాయని కొంత మంది భావిస్తున్నారు. ఇక మహేష్ నటించిన స్పైడర్ సినిమా యుఎస్ లో ఇప్పటికే వన్ మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
- Tags
- స్పైడర్

