హీరోయిన్ గా సెటిలవ్వాలంటే ఈ మాత్రం ఉండాలి మరి!!

నాగార్జున నిర్మాతగా శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గావచ్చిన 'నిర్మల కాన్వెంట్' చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రియ శర్మ గుర్తుందా.. మీకు, అదేనండి 'జై చిరంజీవ' లో మెగా స్టార్ కి మేనకోడలిగా సుజిత కి కూతురిగా నటించి మెప్పించిన శ్రియ శర్మ. ఆ పిల్లే ఇప్పుడు హీరోయిన్ అయ్యింది.' గాయకుడు' 'నిర్మల కాన్వెంట్' లో శ్రియ శర్మ హీరోయిన్ గా నటించినప్పటికీ ఆమె వాలకం ఇంకా చిన్న పిల్లలాగే ఉందన్నారు అందరు. మరి టీనేజ్ వయసులోనూ పాలుకారే బుగ్గలతో చిన్న పిల్ల లక్షణాలు ఏమాత్రం పోకపోయినా కూడా హీరోయిన్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పడానికి రెడీ అంటున్నది.
కానీ శ్రియ శరన్ కి హీరోయిన్ గా అస్సలు అవకాశాలే రావడంలేదు. ఎందుకంటే ఆమెని అందరూ ఇంకా చిన్న పిల్లలాగే ట్రీట్ చేయడం మూలంగా. అందుకే ఏ హీరో కూడా ఆమెను తన సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదు. ఇలాగైతే లాభం లేదని అనుకుందో ఏమో .. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్ధం అయిందట. ఇప్పటికే ఈ అమ్మడు హాట్ హాట్ ఫొటోస్ కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుందట. మరి పాపం ఆ హాట్ ఫోటో షూట్స్ అయినా తనకి అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి.

