హాట్ సుందరి ఏ మాత్రం తగ్గనంటుంది

లక్ష్మి రాయ్ దక్షిణాది నుండి ఉత్తరాదికి వెళ్లి అక్కడ ఛాన్స్ ల మీద ఛాన్స్ లు కొట్టేస్తూ సెటిల్ అవడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బాలీవుడ్ లో లక్ష్మి రాయ్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన జూలీ - 2 బోల్డ్, బ్యూటిఫుల్, బ్లెస్సెడ్ అనే ట్యాగ్ లైన్ తో వెళ్తున్న ఈ చిత్రం వచ్చేనెల 6 న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో లక్ష్మి రాయ్ ఎలా రెచ్చిపోయిందో అనేది జూలీ - 2 ట్రైలర్లో చూపించేసారు. మరి టీజర్ తోనూ, ట్రైలర్ తోనూ ఇచ్చిన హాట్ హడావిడి మరిచిపోక ముందే ఇప్పుడు జూలీ - 2 చిత్ర ఫొటోస్ తో రెచ్చగొట్టడానికి రెడీ అయ్యింది లక్ష్మి.
సినిమా ఎలాగూ వచ్చే నెలలో విడుదవుతుంది కాబట్టి ఈలోపు ఎన్ని వీలయితే అన్ని హాట్ ఫొటోస్ ని వదులుతానంటుంది. మరి అందులో భాగంగానే ఇప్పుడు లక్ష్మి రాయ్ ఒక పిక్ ని వదిలింది. అందులో లక్ష్మీ అందాల ఆరబోత అయ్ బాబోయ్ అన్నట్టుగా బికినిలో రెచ్చిపోయింది. ఇక ఇలాంటి ఫొటోస్ తోపాటు మూవీ ఆన్ లొకేషన్ స్టిల్స్ కూడా ఒక్కొక్కటిగా వదులుతానంటుంది లక్ష్మి. మరి లక్ష్మి రాయ్ అందాల ఆరబోత సినిమాకే హైలెట్ అంటున్నారు దర్శకనిర్మాతలు. ఈ దెబ్బకి లక్ష్మి రాయ్ బాలీవుడ్ లో పాతుకుపోవడం మాత్రం ఖాయంగా కనబడుతుంది అంటున్నారు.
ఇక ఈ జూలీ - 2 కి సెన్సార్ వారు ఒక్క కత్తెర కూడా వెయ్యకుండా సినిమాకి తగ్గట్టే ఏ సర్టిఫికెట్ ని ఇచ్చింది.