హలో టాక్ ఏంటంటే....?

అఖిల్ సినిమా అఖిల్ కి ప్లాప్ ని ఇచ్చి కూర్చో పెట్టేసింది. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలనీ అనుకుంటున్నపుడు విక్రమ్ కే కుమార్ చూపిన కథకు ఒకే చేసాడు అఖిల్ తండ్రి నాగార్జున. హలో సినిమా అఖిల్ కు రీలాంచ్ సినిమా. ఈ నెల డిసెంబర్ 22న ప్రపంచం వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
మంగళవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హలో సినిమాకు 'యు' సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నా.. ఏ రేంజు ఫైటింగులు ఉన్నా కూడా.. సినిమాలో చిన్న రక్తపు చుక్క కూడా చూపించలేదట. హీరోయిన్ కళ్యాణ్ అండ్ అఖిల్ మధ్య కెమిస్ర్టీ, రొమాన్స్ హద్దులు దాటేయలేదంట. అందుకే ఈ సినిమాకు అసలు కట్ కూడా లేకుండా.. 'యు' ఇచ్చేసారు.
ఇకపోతే ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా ఇంటెలిజెంట్ గా ఉందని ఒక టాక్ వినిపిస్తోంది. సినిమాను చూసిన సెన్సార్ బృందం కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అనూప్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుందట. విక్రమ్ కే కుమార్ స్క్రీన్ ప్లే తో సినిమాను నడిపించగలడు..మరి హలో సినిమా ఎలా ఉంటాడో డిసెంబర్ 22 దాక వెయిట్ చేయక తప్పదు

