హలోబ్రదర్ సీక్వెల్‌కు హీరోయిన్స్ ఖరారు

అప్పట్లో నాగార్జున రెండు కేరెక్టర్స్ లో కనబడి రచ్చ చేసిన హలో బ్రదర్ సినిమా ఎంత సక్సెస్ సాధించి నాగార్జున కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యిందో... ఆ హలో బ్రదర్ సినిమా కి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత సీక్వెల్ చేయబోతున్నారని అంటున్నారు. ఈ సీక్వెల్ లో నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య నటిస్తాడని అంటున్నారు. ఇప్పటికే ప్రేమమ్ హిట్ తో మంచి జోష్ మీదున్న నాగ చైతన్య ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఇక ఆ సినిమా పూర్తికాగానే నాగ చైతన్య హలో బ్రదర్ సీక్వెల్ లో నటిస్తాడని అంటున్నారు. ఇక ఈ సీక్వెల్ కి సంబందించిన అన్ని కార్యక్రమాలు మొదలయ్యాయని... ఫుల్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాలని చూస్తున్నారట.
ఇక అప్పటి హలో బ్రదర్ లో నాగార్జున సరసన ఇద్దరు భామలు రమ్యకృష్ణ, సౌందర్య నటించినట్లు ఇప్పుడు హలోబ్రదర్ లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ని నటింప చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే ఇప్పటికే హీరోయిన్స్ ఆడిషన్స్ జరుగుతున్నాయని అంటున్నారు. అందులో ఒక హీరోయిన్ గా తాప్సిని మరో హీరోయిన్ గా జాక్విలిన్ ఫెర్నాండేజ్ లు నటిస్తారని చెబుతున్నారు. అంటే నాగ చైతన్య రెండు కేరెక్టర్స్ లో ఇద్దరు భామలతో రొమాన్స్ చెయ్యడానికి సిద్ధమవున్నాడన్న మాట.

