హమ్మయ్య కాస్త రిలీఫ్ ప్రసాదించాడు!!

టాలీవుడ్ లో బిగ్ బాస్ మొదలైన రోజు ఎన్టీఆర్ అందరిని ఆకట్టుకుని బిగ్ బాస్ షో మీద అంచనాలు పెంచేసాడు. అయితే ఎన్టీఆర్ వారానికి కేవలం రెండు రోజులు మాత్రమే ప్రేక్షకులకు కనబడతాడు. మిగతా రోజులన్నీ మనం బిగ్ బాస్ హౌస్ లోని ఆ పార్టిసిపేట్స్ చేసే పనులను మాత్రమే చూస్తూ కూర్చోవాలి. అక్కడే బిగ్ బాస్ షోకి తేడా కొట్టింది. వారం రోజులనుండి ఆ పార్టిసిపేట్స్ ని చూసే వారికి మాత్రం ఒకింత అసహనంతో పాటే చికాకు తెప్పించింది. ఏ మాత్రం క్రేజ్ లేని నటులను తీసుకొచ్చి ఈ బిగ్ బాస్ షోలో భాగస్వామ్యం చెయ్యడం.. వారు కాస్తా అందులో తన నిజ జీవితంలో ఎలా ఉంటారో చెప్పకుండా మాములుగా తమకు అలవాటైన నటనతోనే షోలో మానేజ్ చేసేస్తున్నారు.
ఇక ఎంతో ప్రతిష్ట్మాకంగా చేపట్టిన ఈ షోకి ఆదిలోనే ప్లాప్ టాక్ వచ్చేసింది. సోమవారం నుండి శుక్రవారం వరకు జరిగిన ఈ బిగ్ బాస్ మీద బాగా నెగెటివ్ ఫీలింగ్ పెట్టేసుకున్న బిగ్ బాస్ ప్రేక్షకులకు వీకెండ్ రాగానే ఎన్టీఆర్ హోస్ట్ గా వచ్చేసి కాస్త ఎంటర్టైన్మెంట్ కల్పించేసాడు. ఎన్టీఆర్ ప్రేక్షకులను ఎటెర్టైన్ చెయ్యడమే కాక షోలో పార్టిసిపేట్స్ తో కూడా మాటామంతి కలిపాడు. షోలో ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరిస్తూ వారికి కాస్త రిలీఫ్ ప్రసాదించాడు. కేవలం హౌస్ మేట్స్ కి మాత్రమే కాదు బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఎన్టీఆర్ బాగా ఎంటర్టైన్ చేసినట్లే.
ఇకపోతే బిగ్ బాస్ హౌసెమెట్స్ మాత్రం ఎటువంటి ఎనర్జి ఫీలింగ్ లేకుండా ఎదో ఉన్నామా తిన్నామా అన్నట్టు గడిపేస్తున్నారు. మరి అలాంటి నీరసం మొహాలను చూస్తుంటే ప్రేక్షకులకి నీరసం వచ్చేస్తుంది. బిగ్ బాస్ పార్టిసిపేట్స్ లో ఒకరైన ప్రిన్స్ తమకి ఎవరో ఒక కొత్త హౌసెమెట్ కావాలని... ఇంకా వారు కాస్త గ్లామర్ గా ఉంటే బావుంటుందని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసాడు. మరి షోలో ఉన్న లేడీస్ ని చూస్తుంటే అక్కడే ఉన్న ప్రిన్స్ కే బోర్ కొడితే సగటు ప్రేక్షకుడు మాత్రం ఎలాంటి ఉత్సాహం ప్రదర్శిస్తాడు. ఇక ఈ రోజు ఆదివారం కూడా ఎన్టీఆర్ ఈ షోని రక్తి కట్టిస్తే కాస్త షోకి క్రేజ్ వస్తుంది. ఈరోజు దాటితే మళ్ళీ ఆ మొహాలనే చూడాల్సి వస్తుంది.

