స్వీటీ పాత గ్లామర్ ఇమేజ్ తిరిగి తెచ్చే చిత్రమట

తమిళ చిత్ర పరిశ్రమలో కథానాయికలు ఎటువంటి డీగ్లామరైజ్డ్ పాత్రలు పోషించినా వాసరికి ఎదురు అయ్యే ఇబ్బందులు పెద్దగా వుండవు కానీ తెలుగు చిత్రాలలో ఆ సాహసం చేశారు అంటే వారి కెరీర్ నాలుగేళ్లు వెనక్కి నెట్టబడటం ఖాయం. అయితే ఈ సాహసం ఓ సామాన్య హీరోయిన్ చేస్తే వేరు కానీ అగ్ర స్థానంలో వున్న అనుష్క శెట్టి లాంటి వారు చేస్తేనో?
అనుష్క తెలుగు తమిళంలో అందరూ స్టార్ హీరోస్ తో సినిమాలు చేసేసిన నాయిక. ఆవిడ సినిమాలతోనే కాక వ్యక్తిగత క్రేజ్ కూడా ఎక్కువే వుంది. ఆ క్రేజ్ తోనే అరుంధతి, పంచాక్షరీ, రుద్రమదేవి వంటి లేడీ ఓరియెంటెడ్ కథలు ఆవిడ వద్దకు వచ్చాయి. సూపర్ చిత్రం నుంచి రుద్రమదేవి వరకు ఆవిడ స్క్రీన్ ప్రెసెంచె ఒక ఎత్తు అయితే బాహుబలి ది బిగినింగ్, సైజు జీరో లలో ఆవిడ స్క్రీన్ ప్రెసెంచె మరో ఎత్తు. ఈ రెండు చిత్రాలలో డీగ్లామరైజ్డ్ పాత్రలలో కథానుసారం బాగా లావు ఐయి కనిపించింది. కాగా అనుష్క పాత్ర పరిమితంగా వుండే ఎస్ త్రీ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి ది కంక్లూషన్ లో దేవసేన పాత్ర నిడివి ఎక్కువ. తొలి భాగంలో వృద్ధ వయసు పాత్రలో కనిపించిన దేవసేన, ఇప్పుడు యవ్వన దశలో యువరాణి గా కనిపించనుండటంతో ఆవిడ నాలుగునెలల కష్టంతో బరువు బాగా తగ్గి నటించింది అంట. అనుష్క కి పాత గ్లామర్ ఇమేజ్ తీసుకొచ్చే చిత్రం బాహుబలి ది కంక్లూషన్ మాత్రమే అని టాక్.

