సౌత్ క్వీన్ కాజల్ అగర్వాల్ లాంఛ్ చేసిన వాలుజడ ఫస్ట్ లుక్

కబాలి" లో రజినీకాంత్ కూతురుగా నటించి అందరి ప్రశంసలందుకున్న సాయి దన్సిక లీడ్ రోల్ ప్లే చేస్తున్న బైలింగ్వల్ మూవీ ‘వాలుజడ’ ఫస్ట్ లుక్ కాజల్ అగర్వాల్ విడుదల చేసింది. ఫస్ట లుక్ ని చూసి ఇంప్రెస్ అయిన కాజల్, వాలుజడ టీం ని అభినందించింది.యదార్ద సంఘటనల ఆదారంగా రూపొందుతున్న ఈ మూవీ 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.. సెప్టెంబర్ నుండి మరో భారీ షెడ్యూల్ జరగబోతోంది.
తమిళ దర్శకులు చేరన్, గౌతమ్ మీనన్, విక్రమ్ కుమార్ ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమణ మల్లం "వాలుజడ"తో దర్శకుడి గా పరిచయం అవుతున్నాడు. కబాలి తో సౌత్ ఇండస్ట్రీ ని ఎట్రాక్ట్ చేసిన దన్సిక ఇందులో డిఫరెంట్ రోల్ ని చేస్తుంది. దన్సిక చూపిస్తున్న డెడికేషన్ కి టీం ప్రశంసలు కురిపిస్తుంది.శరణం గచ్ఛామి, జానకి రాముడు లాంటి సినిమాల్లో నటించిన నవీన్ సంజయ్ "వాలుజడ" లో హీరోగా నటిస్తున్నాడు.మరో ఇంపార్టెంట్ పాత్రలో వెటరన్ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ నటిస్తుండటం విశేషం.