'సై రా'.. తోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

హీరో పాత్రలు చేస్తూ కమెడియన్ గా కొనసాగితే ఆ కామెడీ ఫెస్ ప్రభావం హీరో ఫెస్ మీద పడుతుందని భయపడి.... కమెడియన్ పాత్రలకు పూర్తిగా దూరమై.. కేవలం హీరోగానే ఇండస్ట్రీలో సెటిల్ అవుదామని ఫిక్స్ అయ్యాడు సునీల్. హీరోగా బిజీ అయ్యాక సునీల్ కమెడియన్ పాత్రలు పూర్తిగా చేయడం మానేశాడు అనుకున్నారంతా. కానీ హీరోగా ఫిక్స్ అయ్యాకే కమెడియన్ పాత్రలను దూరం పెట్టాడనేది మాత్రం జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు సునీల్ కి హీరోగా వరుసగా ఫ్లాప్స్ తగులుతుండడంతో జ్ఞానోదయమై తన కామెడీ పాత్రల పై మళ్ళీ ఫోకస్ చేయ్యలనుకుంటున్నాడు.
ఇప్పటికే కామెడీ క్యారెక్టర్లు చేస్తానంటూ సునీల్ ఓపెన్ గా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే క్యారెక్టర్ రోల్స్ లో సునీల్ రీఎంట్రీ మాత్రం ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుతో జరగబోతోంది అని అంటున్నారు. అయితే సునీల్ కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చే సినిమా మరేదో కాదు మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించబోయే 'సైరా నరసింహారెడ్డి' అంటూ వార్తలొస్తున్నాయి. నిజంగానే 'సై రా'లో చిరంజీవితో కలిసి తాను ఓ పాత్ర చేస్తున్నట్లు సునీల్ అనౌన్స్ చేసాడు. అయితే సునీల్ ఈ సినిమాలో లో సీరియస్ పాత్ర చేస్తాడా లేకపోతే కామెడీ రోల్ చేస్తాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
అసలు సునీల్ చిరంజీవి రీఎంట్రీ సినిమా అయిన 'ఖైదీ నంబర్ 150 ' లోనే నటించాలి అనుకున్నాడు. కానీ అప్పుడు హీరోగా వేరే సినిమాల్తో కమిట్మెంట్స్ వలన ఆ దర్శక నిర్మాతలు అభ్యంతరం చెప్పడంతో... అప్పట్లో ఖైదీ లో సునీల్ కామెడీ మిస్ అయ్యాం. ఇక ఖైదీ లో సునీల్ కామెడీ మిస్ అయితే ఏంటి.... మళ్ళీ చిరుతోనే 'సై రా' సినిమా తో సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి కేవలం 'సై రా' లోనే కాకుండా సునీల్ ఇంకా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాలో కూడా కామెడీ రోల్ చెయ్యబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

