సై రా కోసం మేస్ట్రో వస్తాడా?

మెగా స్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ట్మాకంగా నటిస్తున్న చిత్రం సై రా నరసింహారెడ్డి. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ కోసం సమాయత్తమవుతోంది సై రా టీమ్. సినిమా మొదలైనప్పటినుండి ఎప్పటికప్పుడు రకరకాల గాసిప్స్ తోపాటు సై రా కి సంబందించిన న్యూస్ లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పడు కొత్తగా సై రా నరసింహారెడ్డి టీమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా చేరాలని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెళ్లి సంగీత దర్శకుడు ఇళయరాజాను కలిసినట్టుగా టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో ఒక న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సై రా సినిమాని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి టాప్ టెక్నీకల్ టీమ్ పనిచేస్తున్న విషయం తెలిసిందే.
అయితే సై రా టీమ్ లో జాయిన్ కాకముందే ఈసినిమా కి మ్యూజిక్ అందిస్తాడని చెప్పిన ఏ ఆర్ రెహ్మాన్ అర్దాంతరంగా తప్పుకోవడంతో... ఇప్పటివరకు సై రా నరసింహారెడ్డి కి మ్యూజిక్ డైరెక్టర్ సెట్ కాలేదు. ఈ మధ్యలో థమన్, కీరవాణి పేర్లు గట్టిగా వినబడినప్పటికీ... ఇపుడు ఇలా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పేరు తెరమీదకి వచ్చింది. ఇకపోతే ఇటీవల పద్మభూషణ్ పురస్కారానికి ఇళయరాజాని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందుకే చిరంజీవి ఆయన్ను అభినందించేందుకే చెన్నై వెళ్లాడని కొందరు అంటుంటే... కాదు కాదు చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న సై రా సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలకమని,... భావించిన చిరు దానికి ఇళయరాజా అయితే బాగుంటుందని ఆయన్ను కలిసి....ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
అయితే చిరంజీవి ప్రపోజల్ కి ఇళయరాజా అంగీకారం తెలిపినట్లుగా వస్తున్న వార్తలో ఎంత నిజముందో తెలియాలి అంటే..... సై రా చిత్ర బృందం స్పందించాలి. లేదా మెగా కాంపౌండ్ అయినా స్పందిస్తేనే... ఈ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ వస్తుంది.