సై రా కాస్ట్యూమ్స్ కోసం అలా చేశారా?

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి 151 వ సినిమా చారిత్రక నేపథ్యంలో సైరా నరసింహారెడ్డి గా తెరకెక్కుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని శరవేగంగా పూర్తి చేసిన సురేందర్ రెడ్డి బృందం ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కి ప్లాన్ చేస్తుందట. చారిత్రక నేపెథ్యం గల కథ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కాస్ట్యూమ్స్ విషయంలో చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ద పెడుతుందట. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఎలాంటి దుస్తులు ధరించేవాడు. అలాగే ఆయన కాస్ట్యూమ్ స్టయిల్ ని బాగా అధ్యనం చేసిన సై రా టీమ్ అందు కోసం భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్ ను సిద్ధం చేస్తున్నారట.
మరి చిరు పెద్ద కూతురు సుష్మిత ఆధ్వర్యంలో బాలీవుడ్ లో సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన పద్మవత్ చిత్రానికి పనిచేసిన చంద్రకాంత్ సొనావెన్ ఇప్పుడు సైరా కోసం కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నాడట. చంద్రకాంత్ సొనావెన్ ఆద్వర్యంలోని కాస్ట్యూమ్స్ టీమ్ మొత్తం ఇందుకు సంబందించిన కాస్ట్యూమ్స్ ని అన్నిటిని ఒక పెద్ద అంటే భారీ షాప్ లో ఉంచి.... ప్రతి రోజు కూడా ఆ రోజున ప్లాన్ చేసిన సన్నివేశాలను బట్టీ .. పాత్రధారులను బట్టి కాస్ట్యూమ్స్ ను సెట్ చేస్తారట.
ఇక ఈ భారీ కాస్ట్యూమ్స్ షాప్ ని అన్నపూర్ణ స్టూడియో పరిథిలోని ఎకరం స్థలంలో రూపొందిస్తున్నారట. మరి సై రా కోసం ఏకంగా ఒక కాస్ట్యూమ్స్ షాప్ పెట్టేస్తున్నారంటే... సై రా నరసింహారెడ్డి సినిమాకి కాస్ట్యూమ్స్ ఎంత ఇంపార్టెంటో అర్ధమవుతుంది.