సుమంత్ హీరోయిన్ పెళ్లయ్యాకే హీరోయిన్ అయ్యింది

అక్కినేని కాంపౌండ్ నుండి వచ్చిన సుమంత్ హీరోగా నిలదొక్కుకోలేక అష్టకష్టాలు పడుతున్నాడు. గ్యాప్ ల మీద గ్యాప్ లు తీసుకుని సినిమాలు చేస్తున్న సుమంత్ కి విజయం అనేది అందని ద్రాక్షే అయ్యింది. అయితే సుమంత్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన మళ్ళి రావా సినిమాతో ఓ మోస్తరుగా మంచి హిట్టే కొట్టాడు. అయితే ఈ సినిమాలో సుమంత్ తో పోటీగా నటించి ఆకట్టుకున్న హీరొయిన్ ఆకాంక్ష సింగ్.... ని చూసాక ఈ హీరోయిన్ ఎవరనే ఆసక్తిని అందరిలోనూ రేపింది. ఇందులో టీనేజ్ లోనే డీప్ లవ్ లో పడిపోయిన అమ్మాయిగా నటించిన ఆకాంక్షకు రియల్ లైఫ్ లో నిజంగా అలాగే జరిగిందట. కాకపోతే మళ్ళి రావా సినిమాలో లాగా గ్యాప్ రాకుండా 16 ఏళ్ళకే తన లవర్ ని పెళ్లి చేసేసుకుని ఇల్లాలైందట.
మళ్ళీ రావా.. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ కు పెళ్లై అప్పుడే ఏడేళ్ళు దాటుతోందట. తమకు పెళ్ళయ్యే నాటికి భర్త వయసు కూడా 20 మాత్రమే అని చెబుతున్న ఆకాంక్ష సింగ్ ది కూడా ప్యూర్ లవ్ స్టొరీనే అట. పెళ్లి జరిగాకే భర్త ప్రోత్సాహంతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఆకాంక్ష మొదట్లో చిన్న చిన్న ఆల్బమ్స్, షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ చేసి ఇప్పుడు ఏకంగా హీరోయిన్ అయ్యి కూర్చుంది. దర్శకుడు గౌతం ఆకాంక్షలోని టాలెంట్ గుర్తించి మళ్ళి రావా లో హీరొయిన్ గా ఆఫర్ ఇవ్వడం... అది కాస్త హిట్ అవ్వడంతో ఆకాంక్ష గురించి ఇప్పుడందరూ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా పెళ్ళైన అమ్మాయిలు హీరొయిన్ గా రాణించడం చాలా అరుదు. అలాంటిది ఒక్క సినిమాతోనే మెప్పించిన ఆకాంక్ష ఈ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.

