సినిమా విడుదల అయ్యేవరకు ఆగలేకున్నా?

త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి పై భారీ అంచనాలు వున్నాయి. వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మూడో చిత్రం ఇది. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలు తగ్గటే శనివారం విడుదల అయిన టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది.
ఈ టీజర్ ను ఇప్పటి వరకు 78.86 లక్షల మంది వీక్షించగా 449001 మంది లైక్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ ట్రేండింగ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. విడుదలైన ఈ టీజర్ పై రామ్ చరణ్ మరియు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
‘బాబాయ్ ఎట్ హిజ్ బెస్ట్. టీజర్లో ఆయన ప్రతి ఎక్స్ ప్రెషన్ చాలా నచ్చింది. సంక్రాంతి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని బాబాయ్ ని తెగ పొగిడేసాడు చరణ్. టీజర్ లో పవన్ కళ్యాణ్ ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయని పవన్ తన మేనరిజంతో అదరగొట్టాడని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్ పెట్టాడు. ఇక ఈ చిత్రం లో అలనాటి అందాల నటి ఖుష్బూ....ఓ కీలకమైన పాత్ర పోషిస్తోంది. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెల విడుదల అవుతుంది

