సినిమా అంటేనే గ్లామర్ అంటున్న హీరోయిన్

సినిమా ప్రపంచం అంటేనే గ్లామర్ ఫీల్డ్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచంలోకి వచ్చిన ఏ హీరోయిన్ అయినాసరే గ్లామర్ ఒలకబొయ్యక తప్పదు. నూటికో కోటికో ఒక హీరోయిన్ మాత్రమే అందాలు ఆరబొయ్యకుండా ఈ ఫీల్డ్ లో టాప్ ప్లేస్ కి చేరుకుంటుంది. అయితే ఈ సినిమా ఫీల్డ్ లోకి వచ్చాక అందాల ఆరబోత ఉంటుందని తెలిసే ఇందులో అడుగుపెట్టానని చెబుతుంది టాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన అక్కినేని సమంత. నాగ చైతన్య తో పెళ్లి తర్వాత కూడాసినిమా ఫీల్డ్ ని వదలనని చెప్పిన సమంత పెళ్లి తర్వాత కూడా గ్లామర్ ఒలకబోస్తుంది.
మరి ఎప్పుడూ తాను చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పే సమంత తాజాగా తనని అక్కినేని కోడలిగా మారాక కూడా ఇలా బికినీ షో ఎందుకమ్మడు అని ప్రశ్నించిన వారికి మీ పని మీరు చూసుకోండి... నా పని నేను చేసుకుంటా అని చెప్పిన సమంత ఇప్పుడు తన సినిమా జీవితం గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. తన సినిమా జీవితం గురించి ఎదురైన ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ కథ డిమాండ్ చేస్తే.... గ్లామర్ గా నటించడం తప్పేమీ కాదని.... అలాగే అవసరం లేని చోట గ్లామర్ గా ఉండటం తనకు ఇష్టం ఉండదని కుండబద్దలు కొట్టింది.
ఇకపోతే నాగ చైతన్య తో తన పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉందొ కూడా మీడియా తో పంచుకుంది. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే..... ఏ వృత్తిలోనైనా స్వేచ్ఛగా ఉండొచ్చని అభిప్రాయపడింది. తాను చైతూతో గొడవలు పడుతూ ఉంటానని, ఆ తరువాత చైతూ బెట్టుతో తనతో మాట్లాడడని, ఆపై తానే మాట్లాడతానని కూడా చెప్పుకొచ్చింది సమంత.