సినిమాని మొదలుపెట్టకుండానే... అమ్మేసారు

హీరో నిఖిల్ ప్రస్తుతం కన్నడ సినిమా కిరిక్ పార్టీ రీమేక్ లో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగు ప్రేక్షలులని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తుంటాడు నిఖిల్. అయితే నిఖిల్ ఇప్పుడు కిరాక్ పార్టీ రీమేక్ తర్వాత ఒక తమిళ్ సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
కోలీవుడ్ లో అథర్వా, కాథరిన్ జంటగా నడిచిన చిత్రం కానితన్. అయితే ఈ సినిమాకి కోలీవుడ్ లో అంతగా ఆదరణ లభించలేదు. కానీ ఇపుడు ఈ సినిమాని నిఖిల్ తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకి ఇంకా సెట్స్ మెదకు వెళ్లకుండానే ఒక మాంచి బేరం వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా మొదలవ్వకముందే..... ఓ పార్టీతో 11కోట్లకు ఈ సినిమా అగ్రిమెంట్ కూడా అయిపోయినట్లు తెలుస్తోంది.
అయితే ఠాగూర్ మధు ఈ సినిమా మొత్తం 7 కోట్ల బడ్జెట్ లో ఫినిష్ చేయాలనుకుంటున్నాడు. మరి ఠాగూర్ మధు అనుకున్నట్లుగా ఆ 7 కోట్ల బడ్జెట్ లోనే సినిమా పూర్తి చేయగలిగితే మధుకు నాలుగుకోట్లు లాభం వస్తుంది. లేదూ. మరి మాంచి డీల్ అయితే వచ్చింది కానీ జాగ్రత్తగా ప్రొడక్షన్ ప్లాన్ చేసుకుంటే మాంచి లాభమే వస్తుంది.

