సిద్ధుని ఆపుతున్నది ఎవరు?

ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న సిద్దార్ధ్.. ఈమధ్యన మాత్రం అతనినుండి సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద సందడి చెయ్యలేదు. అయితే తాజాగా సిద్దార్థ్ హీరో గా, ప్రొడ్యూసర్ గా చేసిన సినిమా 'గృహం'. ఈ సినిమా తమిళ్ లో 'అవల్' గా తెరకెక్కడమే కాదు... తెలుగు తో పాటు హిందీ లో ఏకకాలం లో రూపొందింది. ఈ సినిమా యొక్క తమిళ వెర్షన్ గత వారమే రిలీజ్ అయ్యి అక్కడ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అసలైతే ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా నవంబర్ మొదటి వారం లో తమిళ వెర్షన్ తో పాటె రిలీజ్ అవ్వాల్సింది. కాని అప్పటికే తెలుగు లో రిలీజ్ అయ్యే సినిమాలు ఎక్కువ ఉండే సరికి ఈ సినిమాని ని పోస్ట్ పోన్ చేసాడు సిద్దార్థ్.
అయితే అప్పుడు తెలుగులో విడుదల చేయలేకపోయిన ఈ సినిమాని సిద్దార్థ్ నవంబర్ 10 న రిలీజ్ చేద్దాం అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు కూడా థియేటర్స్ కొరత వల్ల ఈ సినిమాని తెలుగులో సిద్దార్థ్ పోస్ట్ పోన్ చేసుకున్నట్లుగా సమాచారం. నవంబర్ 9 న విజయ్ 'అదిరింది' విడుదలవుతుండగా.... నవంబర్ 10 న మనోజ్ 'ఒక్కడు మిగిలాడు', విశాల్ డిటెక్టీవ్', సందీప్ కిషన్ 'కేరాఫ్ సూర్య' కూడా విడుదలవడం వలన థియేటర్స్ కొరత ఏర్పడి సిద్దార్థ్ తన 'గృహం' సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకున్నాడంటున్నారు. కానీ.... ఇదంతా చూస్తుంటే సిద్దార్థ్ సినిమా ని తెలుగు లో రిలీజ్ అవ్వకుండా కొందరు నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు.
అయితే కేవలం థియేటర్స్ లేకపోవడం.... మళ్ళీ ఈ వారం కూడా తెలుగు లో ఎక్కువ సినిమాలు రిలీజ్ లు ఉండే సరికి సిద్దార్థ్ మూవీ పోస్ట్ పోన్ అయ్యిందని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. మరి నిజంగానే సిద్దు ని తెలుగులో ఎవరైనా అడ్డుకుంటున్నారా అనే అనుమానం గట్టిగానే బలపడుతుంది. మరి ఆ నిర్మాతలు ఎవరనే దాని మీద కొద్దిగా చర్చ కూడా స్టార్ట్ అయ్యింది.

