సింపుల్ పెళ్ళికి సింపుల్ రిసెప్షన్

టాలీవుడ్ లో అందమైన ప్రేమ జంట నాగ చైతన్య - సమంతలు వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఇక ఎంతో సింపుల్ గా చేసుకున్న ఈ పెళ్ళికి భారీ పబ్లిసిటీ వచ్చింది. వీరి పెళ్లి జరిగి అప్పుడే పది రోజులు కావొస్తున్నా... ఇంకా ఈ బ్యూటిఫుల్ జంట గురించిన డిస్కషన్ టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తూనే ఉన్నాయి. వీరి పెళ్లి పరంగానే రెండు పెళ్లిళ్లు చేసుకుని సంచలం సృష్టిస్తే.... ఇప్పుడు హాని మూన్ ని వాయిదా వేసుకుని తమ కమిట్మెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ అందరి మనసులను దోచేస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిన ఈ జంట... మధ్య మధ్యలో అక్కినేని ఇంట్లో జరిగే పూజలతో బిజీగా మారారు.
ఇక ఇప్పుడు తాజాగా చైతు - సామ్ లు రెండు సార్లు పెళ్లి చేసుకున్నటుగానే... రిసెప్షన్ కూడా రెండు సార్లు జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే నాగార్జున చేసే రిసెప్షన్ కి చైతు - సామ్ లు డేట్స్ ఇవ్వకుండా నాగ్ ని ఇబ్బందిపెడుతున్నారని నాగార్జునే స్వయంగా చెప్పాడు. వారు డేట్స్ ఇచ్చినప్పుడే చైతు - సామ్ ల రిసెప్షన్ అని చెప్పాడు. ఇక మరో రిసెప్షన్ ని చైతు తల్లి లక్ష్మి చెన్నైలో ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే ఆ రిసెప్షన్ ని చెన్నైలో కాకుండా ఇక్కడ హైదరాబాద్ లోని దగ్గుబాటివారి ఇంట్లో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. లక్ష్మి తన పుట్టింట్లో నాగ చైతన్య - సమంతల సింపుల్ రిసెప్షన్ ని ఏర్పాటు చేస్తుందట.
ఇక ఈ ఏర్పాట్లను దగ్గుబాటి సురేష్ బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడట. ఈ రిసెప్షన్ కి దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటే దగ్గరి బంధువులు మాత్రమే హాజరవుతారనే సమాచారం అందుతుంది. వెంకటేష్, రానా తోపాటు నెల్లూరు, కారంచేడు అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి దగ్గుబాటి దగ్గరి బంధువులు ఈ రిసెప్షన్ కి రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రిసెప్షన్ ఏర్పాట్లు సురేష్ బాబు ఇంట్లో నే ఏర్పాట్లు చేస్తున్నారట. సో... ఈ లెక్కన నాగ చైతన్య - సమంత ల మొదటి రిసెప్షన్ ఇలా పూర్తి కానుందన్నమాట.

