సాహో షూటింగ్ కి బ్రేక్

ప్రభాస్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సాహో చిత్రం గత జూన్ లో ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బాహుబలి తరువాత అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సాహో పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అందులోను ఈ చిత్రం 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండడంతో... ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మరో ఐదారు నెలల్లో సినిమా షూటింగ్ ని శరవేగంగా కానిచ్చి విడుదల చేసే ప్లాన్ లో దర్శకుడు సుజిత్ ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే సాహో షూటింగ్ లో పాల్గొనడానికి గాను శ్రద్ద హైదరాబాద్ నుండి ముంబై.... ముంబై నుండి హైరాబాద్ సర్వీస్ చేస్తుంది. మరి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ కి బ్రేకులు పడ్డాయట. నిన్న సాహో షూటింగ్ కి అర్దాంతరంగా పేకప్ చెప్పేశారని అంటున్నారు. అయితే షూటింగ్ లొకేషన్ లో ఆకస్మికంగా ప్రభాస్ కు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే షూటింగ్ ఆపేసి ప్రభాస్ ని ఆసుపత్రికి తరలించారట చిత్ర బృందం. అయితే ఇందులో టెన్షన్ పడాల్సింది ఏమి లేదని..... ప్రభాస్ నీరసం కారణంగా అలా అయ్యాడని..... రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా కోలుకుంటాడని చెప్పారట డాక్టర్స్.
తెలుగు, హిందీ, తమిళ , మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న సాహో చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో షూటింగ్ లొకేషన్ కు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవడంతో అవాక్కయిన దర్శక నిర్మాతలు లీకేజి రాయుళ్ల పనిపట్టే ప్రయత్నాల్లో ఉన్నారట.