సాహో పై ఇంట్రస్టింగ్ న్యూస్

ప్రభాస్ బాహుబలి తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సాహో చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకుని రెండు నెలలు కావొస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో టీజర్ ని పరిచయం చేసిన సుజిత్ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తాడో అనే క్యూరియాసిటీ ప్రతివక్కరిలో నెలకొంది. కాకపోతే సాహో ఎలా వుండబోతుందనే దానిమీద ఎడతెగని చర్చ జరుగుతుంది. అయితే సాహో కథ కి సంబందించిన ఒక క్లూ దొరికిందంటూ ప్రచారం మొదలైంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న సాహో షూటింగ్ విశేషాలు ప్రకారం ఈ కథ పునర్జన్మ పైన కానీ, టైమ్ ట్రావెల్ పైకానీ ఉండవచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
సాహో కి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. అయితే అక్కడ జరిగే షూటింగ్ లో బ్రిటిష్ జాతీయ జెండా ఒకటి ఎగురుతూ కొన్ని వందల గుర్రాలు మధ్య కొన్ని యుద్ద సన్నివేశాలు చిత్రీకరణ చేస్తునట్లు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రంలో పోలో ఆట పై కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మరి అక్కడ వాళ్ళ వేషాదారణ... అక్కడ నిర్మించిన సెట్ చూస్తుంటే ఇండియా ఇండిపెండెన్స్ ముందు కథ ఏదో ఉంది అని అనిపిస్తుందిట. మరి ఇలాంటి సెట్ సాహో సినిమాలో ఎందుకు ఉందో అర్ధమకావడంలేదుగాని.... దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలిసి ఉంది.
మరి ఇదంతా చూస్తుంటే సాహో కథ పూర్వకాలం కి సంబందించినట్టు అనిపిస్తుంది. కానీ సాహో టీజర్ లో ప్రభాస్ లుక్, ఆ సెట్ డిజైన్స్ అన్ని చూస్తుంటే అది ఇప్పుడు ఈ ట్రెండ్ కి సంబందించిన స్టైలిష్ లుక్ గా కనిపిస్తుంది. మరి ఇదంతా చూస్తుంటే సాహో చిత్ర కథకి పునర్జన్మ కి ఏదన్న సంబంధం ఉందా అనే డౌట్ క్రియేట్ అవుతుంది. మరోపక్క అయితే ఈ టైమ్ ట్రావెల్ కథలో ప్రభాస్ ద్విపాత్రా అభినయంచేసే అవకాశం లేకపోలేదంటూ మరో కొత్త డౌట్ ని లేవనెత్తుతున్నారు. మరి సాహో ఎలా ఉండబోతుందో అనేది మాత్రం చిత్ర యూనిట్ నుండి పూర్తి క్లారిటీ వస్తే గాని అర్ధంకాదు.

