సాఫ్ట్ లుక్ లో స్టైలిష్ గా వున్నాడు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' లోని జై టీజర్ లో ఎన్టీఆర్ విలన్ లుక్ లో అదరగొట్టేసాడు. ఒక హీరో విలన్ గా చేస్తే చూడాలనుకున్న వారికి కావాల్సినంత చూపించేసాడు. ఇక జై లవ కుశలోని 'లవ' ఫస్ట్ లుక్ లో ఎంతో కూల్ గా స్టైలిష్ లుక్ లో కనబడిన ఎన్టీఆర్ ఇప్పుడు 'లవ' టీజర్ లో కూడా అంతే కూల్ గా స్టైలిష్ లుక్ లో సాఫ్ట్ గా అలరించడానికి వచ్చేసాడు.
లవ టీజర్ లో ఎన్టీఆర్ నీట్ గా నడుచుకుంటూ వస్తూ... తనని తానూ పరిచయం చేసుకుంటాడు. 'హాయ్ ఐయామ్ లవ కుమార్... ఒక ప్రవేట్ బ్యాంకు లో మేనేజర్ గా పనిచేస్తున్నాను అంటూ వెరైటీగా నానో కారు బయటికి తీసి... దాన్ని వేసుకుని బయలుదేరిన లవ కుమార్... నాకో వీక్నెస్ వుంది అంటూ చెబుతుంటాడు. బ్రహ్మజీ బ్యాంక్లో ఎదురుపడి ఎన్టీఆర్ బ్రీఫ్ కేస్ తీసుకోబోతూ సర్ మీ బాధ్యత ఎలాగూ మొయ్యలేను... కనీసం ఈ బ్రీఫ్ కేస్ అయినా మొయ్యనివ్వండి అంటూ అతి వినయం పోగా దానికి ఎన్టీఆర్, బ్రహ్మజీతో.. రాంబాబు గారు మీరు బ్యాంకు కి అసిస్టెంట్ మేనేజర్ నాకు కాదు... అంటూ సమాధానం చెబుతాడు. ఇక ఎన్టీఆర్ హాస్పిటల్ బెడ్ మీద కూర్చుని... మంచితనమనేది పుస్తకాల్లో ఉంటె పాఠమవుతుంది... మనలో ఉంటె గుణపాఠమవుతుంది అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా వుంది. అలాగే ఎన్టీఆర్ ఎమోషనల్ గా ఆ మంచి తనమే నా జీవితాన్ని తల్లకిందులు చేసింది అంటూ టీజర్ ని ఎండ్ చేసేసాడు.
మరి 'జై' టీజర్ తో తనలోని విశ్వరూపం చూపించిన ఎన్టీఆర్ 'లవ' టీజర్ లో ఎంతో సాఫ్ట్ గా, సైలెంట్ గా అనిపిస్తున్నాడు. ఇక లవ కుమార్ గా ఎమోషన్, ఎన్టీఆర్ ఫేస్ లోని ఎక్సప్రెషన్స్ సూపర్ అనిపించేలా వున్నాయి. అలాగే ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ మ్యూజిక్ కూడా 'లవ' టీజర్ కి తగ్గట్టుగానే వుంది. స్మూత్ గా, డీప్ గా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ బాగానే హ్యాండిల్ చేస్తున్నాడని.... 'జై' టీజర్, 'లవ' టీజర్ ని చూస్తుంటే అర్ధమవుతుంది.
కళ్యాణ్ రామ్ నిర్మతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెల 21 న ఖచ్చితంగా విడుదలవుతుందని ఎన్టీఆర్ ఆర్ట్స్ బల్లగుద్ది చెబుతుంది. అలాగే ముందునుండి వారు చెప్పినట్టుగానే ఇప్పుడు 'లవ' టీజర్ తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది. ఇక ఈ రెండు టీజర్స్ తో కేక పెట్టించిన 'జై లవ కుశ' లో 'కుశ' టీజర్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అయితే అతి త్వరలోనే ఆ టీజర్ ని కూడా విడుదల చేస్తామని ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు చెబుతున్నారు. మరి వినాయక చవితి శుభాకాంక్షలతో 'లవ' టీజర్ వచ్చేసింది. అలాగే 'జై లవ కుశ' ఆడియో కూడా సెప్టెంబర్ 3 న జరగబోతుంది.