సరదాగానే.. కానీ..!!

అఖిల్ సినిమాతో దెబ్బతిన్న అఖిల్ ఇపుడు మాత్రం తండ్రి నాగార్జునతో కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తన రెండో సినిమాని మొదలెట్టి సెట్స్ మీదకెళ్ళాడు. కానీ ఆ సినిమాకి ఇంకా హీరోయిన్ సెట్ కాలేదంటున్నారు. హీరోయిన్ గురించి ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. మరి సినిమాకి నాగార్జునే నిర్మాత కావడం ఈ సినిమా గురించి ఏ విషయము బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడం చూస్తుంటే నాగార్జున ఈసారి అఖిల్ కి మంచి హిట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బలంగానే కనబడుతున్నాడు.
మరి ప్రేమ కథతో రాబోతున్న ఈ చిత్రాన్ని భారీ హంగులతో నాగార్జున నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి సంబందించిన ఒక పిక్ ని అఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే ఆ పిక్ లో అఖిల్ సరదాగా కెమెరాతో ఈ స్టిల్ ఇచ్చాడో లేదో తెలియదు కానీ.. దీనిపై విమర్శలు సైతం వస్తున్నాయి. వీటిని విమర్శలు అనేకంటే హెచ్చరిక అంటే ఇంకా బావుంటుందేమో..అంటున్నారు. ఎందుకంటే అఖిల్ తొలి చిత్రం విషయంలో నాగార్జున ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువగా ఉందని, నాగ్ సూచించిన మార్పులతో వివి వినాయక్ కన్ఫ్యూషన్ కు గురయ్యాడనే వార్తలు ఉన్నాయి. అందువలనే అఖిల్ చిత్ర అవుట్ ఫుట్ సరిగా రాక ఫెయిల్ అయిందని వార్తలొచ్చాయి.
ఇక ఇప్పుడు అఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్ ని చూపిస్తూ ఇలాంటి విమర్శలే చేస్తున్నారు. డైరెక్టర్ గా విక్రమ్ కుమార్, సినిమా టోగ్రాఫర్ పి ఎస్ వినోద్ లాంటి ప్రతిభావంతులు ఉన్నారు. ఇంకా ఇండస్ట్రీ లో కుదురుకుని అఖిల్ వారి పనిలో వేలు పెట్టడం మంచిది కాదని, అలా చేస్తే తొలిచిత్రం రిజల్టే రిపీట్ అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

