సమంత కోసం మరోమారు తన్నులు తిన్నారు

సినిమా తారలంటే అభిమానుల అభిమానానికి హద్దే ఉండదు. అంతగా తమ అభిమాన నటీనటులను అభిమానులు ఆరాధిస్తారు. తమ అభిమాన హీరో కోసం చావడానికైనా... పోలీస్ ల చేతిలో తన్నులు తినడానికైనా సిద్దంగానే ఉంటారు. తమ అభిమానానికి అసలు హద్దులే లేవన్నట్టుగా కొన్నిసార్లు అభిమానులు రెచ్చిపోతూ తమ అభిమానాన్నని ప్రదర్శిస్తుంటారు. గతంలో అంటే మొన్నామధ్యన తమిళనాట సమంత ఒక షోరూం ఓపెనింగ్ కి వెళితే అక్కడ అభిమానుల కోలాహలంతో కారెక్కడానికి కూడా వెళ్లలేకపోతే పోలీస్ లు రంగప్రవేశం చేసి అభిమానులను లాఠీఛార్జ్ చేసి మరి సమంతని కారెక్కించారు.
అయితే తాజాగా ఇప్పుడు అనంతపురంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అనంతపురంలోని సుభాష్ రోడ్డులో ఒక మొబైల్ షోరూం ఓపెనింగ్ కి వచ్చిన సమంత ని చూడడానికి అభిమానులతో పాటే... అక్కడి స్థానికులు కూడా భారీగా తరలి వచ్చారు. అయితే అంతమందిలోనుండి ఒక యువకుడు అత్యుత్సాహంతో సమంత మీదకి దూసుకురావడానికి ప్రయత్నించగా... వెంటనే అలెర్ట్ అయిన పోలీస్ లు ఆ యువకుడిని అడ్డుకోగా... దానికి ఆ యువకుడు పోలీస్ లపై తిరగబడగా.. అక్కడే ఉన్న పోలీస్ లు ఆయువకుడుపై లాఠీ ఛార్జ్ చేశారు.
అంతేకాకుండా షోరూం దగ్గర కు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులపై కూడా పోలీస్ లు లాఠీ ఛార్జ్ చేశారు. అందులో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అయితే సమంత మాత్రం మొబైల్ షోరూం ని ప్రారంభించేసి అక్కడనుండి సైలెంట్ గా వెళ్ళిపోయింది. ఇక అభిమానుల తో ఏం మాట్లాడడం కానీ, మీడియాతో మాట్లాడడం కానీ చెయ్యకుండా సమంత సైలెంట్ గా వెళ్ళిపోయింది. అభిమానులకు వెర్రి ఉండొచ్చుగాని... ఇంతలా వేలం వెర్రి ఉండకూడదని ఈ సంఘటన అయినా పాఠంనేర్పుతుందేమో చూడాలి.

