సమంత కి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో

సమంత పెళ్ళైన తర్వాత కూడా సినిమాలు, షూటింగ్స్ అంటూ తెగ హడావిడి చేస్తూనే ఉంది. తెలుగు, తమిళంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతుంది. సమంత కి పెళ్ళైనా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం సమంత తెలుగులో రామ్ చరణ్ కి జోడిగా రంగస్థలం, సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న మహానటి సినిమా లో మరో కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే తమిళంలో కూడా రెండు మూడు సినిమాలతో బిజీగా వుంది. అయితే రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా మొదలైన కొత్తల్లో రాజమండ్రిలో వేసవి తాపానికి వడదెబ్బ తిన్న సమంత అప్పుడు కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా సమంత వర్షంలో తడుస్తూ షూటింగ్ చేస్తూ కష్టపడుతుంది. ఆ విషయాన్నీ సమంతే స్వయంగా చెబుతుంది. తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న సూపర్ డీలక్స్ చిత్రం కోసం సమంత రాత్రివేళల్లో షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన వర్షంలో జరిపే షూటింగ్లో పాల్గొనాల్సి వస్తోందట. చెన్నైలోని టెన్సకి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందట. అక్కడ షూటింగ్ స్పాట్ లో దిగిన ఫోటోని ఇంస్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ఆ పిక్ పై రాజమహేంద్ర వరంలో మండుటెండలో షూటింగ్ లో పాల్గొన్నాను. అలాగే ఇప్పుడు టెన్సకిలో రాత్రిళ్లు వర్షంలో జరుగుతున్న చిత్రీకరణలో పాల్గొంటున్నాను. దేవుడా... నాతో ఎందుకు ఇలాంటి ఆటలు ఆడుతున్నావ్ అంటూ పోస్ట్ చేసింది.
మరి అలా సమంత ఏడుస్తున్న పిక్ చూసి సమంత హార్ట్ కొర్ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. తమ అభిమాన నటికి ఎన్ని కష్టాలో అంటున్నారు. మాములుగా సమంత కి పని మీద ఎంత శ్రద్దో వేరే చెప్పక్కర్లేదు. మరి షూటింగ్ లో ఎన్ని కష్టాలను అయినా నవ్వుతూ భరించేస్తుంది. కాకపోతే ఇలా అందరిని ఆటపట్టించడానికి... అలాగే తన కష్టాన్ని అందరితో పంచుకోవడానికి మాత్రమే ఈ పిక్ ని పోస్ట్ చేసిందంటున్నారు అభిమానులు.