సమంతకి చిన్న రోలేనంట

ఏ మాయ చేసావె సినిమాలోను ప్రేమలో పడ్డారు... రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడి ఒకటి అయింది ఈ జంట. గత ఏడాదిలో చైతు - సామ్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఐన తర్వాత కూడా సామ్ సినిమాలు చేయడం మానలేదు. ఇంతకు ముందు ఎంత జోష్ తో చేసిందో అదే జోష్ ను మళ్లీ కంటిన్యూ చేస్తూ తెలుగు.. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
తాజాగా చైతు - సామ్ కలిసి మరోసారి సినిమాలో నటించబోతున్నారు. నిన్ను కోరి దర్శకుడు శివ డైరెక్షన్ లో వీరిద్దరూ నటించబోతున్నారు. అయితే సమంత ఇందులో ఫుల్ లెన్త్ క్యారక్టర్ కాదట. కేవలం గెస్ట్ రోల్ మాత్రమే అంట.
డైరెక్టర్ శివ చైతుకి కథ చెప్పనప్పుడు గెస్ట్ రోల్ కు సమంత పేరు తనే స్వయంగా సూచించాడట. ఏ మాయ చేసావె తర్వాత ఆటోనగర్ సూర్యలో నటించారు. మళ్లీ మనంలో నటించారు అంతే తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు. పెళ్లి తర్వాత చై- సమంతలు వెండితెరపై తిరిగి కలిసి నటిస్తున్నారని అభిమానులు ఆనందపడుతున్నారు. కానీ సమంతది చిన్న రోలెనని ఫీల్ అవుతున్నారు. క్యాక్టర్ చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే వీళ్లిద్దరూ కలిసి నటించడం ఆ సినిమాకు ప్లస్ పాయింటే అవుతుంది.

