సంపత్ ఇద్దరు హీరోలను వాడాడా..?

గోపీచంద్ హీరోగా డైరెక్టర్ సంపత్ నంది 'గౌతమ్ నందా' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ఈ నెల 28 న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సంపత్ నంది తన 'బెంగాల్ టైగర్' సినిమాకి ముందు పవన్ తో సినిమా డైరెక్ట్ చెయ్యాలని కలలు కన్నాడు. కానీ అది వర్కౌట్ కాక రవితేజతో 'బెంగాల్ టైగర్' చిత్రం చేసాడు. ఇక పవన్ మీద ఉన్న అభిమానంతో గోపీచంద్ ని హీరోగా పెట్టి చేసిన సినిమాకి పవన్ సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ పేరును తన సినిమా టైటిల్ గా పెట్టుకుని పవన్ ఫ్యాన్స్ ని పడేసాడు.
ఇంతకుముందే రవితేజ సినిమాకి పవన్ డైలాగ్ 'బెంగాల్ టైగర్' పేరు పెట్టినప్పుడే పవన్ ఫ్యాన్స్ ఇంప్రెస్స్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు 'గౌతమ్ నందా' విషయంలోనూ వారు మంచి క్యూరియాసిటీతోనే ఉన్నారు. పవన్ విషయం అలా ఉంటే సంపత్ నంది మరో హీరో ఫ్యాన్స్ ని కూడా పడేసాడనే టాక్ వినబడుతుంది. 'గౌతమ్ నందా' లో గోపీచంద్ పేరుని ఘట్టమనేని గౌతమ్ నంద అని పెట్టారని అంటున్నారు. ఈలెక్కన ఘట్టమనేని మహేష్ ని కూడా సంపత్ ఫుల్ గా వాడేసాడు. మహేష్ ఇంటిపేరుని పెట్టుకుని మహేష్ ఫ్యాన్స్ సింపతీ కొట్టేశాడని అంటునారు.
అయితే ఇక్కడ మరొక విషయం డీప్ గా గమనిస్తే గౌతమ్ నందాలో ఘట్టమనేని గౌతమ్ అని గోపీచంద్ పేరు అంటే మహేష్ కొడుకు గౌతమ్ పేరు కూడా ఇదే అవడం పెద్ద విశేషమే. మరి ఈ లెక్కన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా 'గౌతమ్ నంద' కి ఫ్యాన్స్ అవడం ఖాయం. మరి సంపత్ తెలివితేటలు చూస్తుంటే ఇంత ఫుల్ గా ఇద్దరు హీరోలను వాడేశాక హీరోల ఫ్యాన్స్ పడక చస్తారా అనిపిస్తుంది.

