Tue Mar 24 2026 11:56:12 GMT+0530 (India Standard Time)
శివాని లుక్ సూపర్!!

హీరోయిన్స్ గా సినీ ఇండస్ట్రీలో పాతుకుపోవాలంటే వారికి కచ్చితంగా నటనతో పాటు అందం కూడా ఉండి తీరాలి. ఆలా అయితే ఎక్కువ ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండగలరు. ఇప్పుడు చాలా మంది స్టార్ ఫామిలీస్ నుండి భామలు వెండితెరను ఏలడానికి సిద్ధమవుతున్నారు.
మొన్నటివరకు హీరోయిన్స్ కూతుర్లు పెద్దగా ఇండస్ట్రీలో కనిపించే వారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే అసలు విషయానికి వస్తే.. హీరో రాజశేఖర్ కూతురు తల్లి జీవిత సహకారంతో శివాని వెండితెరకు పరిచయం కాటానికి ఎంతో సమయం పట్టేలాలేదు. ఎందుకంటే ఆమె అందం ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తోంది.
లేటెస్ట్ గా జరిగిన ఓ మ్యారేజ్ లో శివాని లంగా వోణి లో కనిపించి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. ఆల్రెడీ '2 స్టేట్స్' తెలుగు రీమేక్ లో హీరో అడివి శేష్ పక్కన హీరోయిన్ గా చేయడానికి సిద్దపడిన సంగతి తెలిసిందే. అయితే వెండితెరపై ప్రేక్షకులని ఎలా అలరిస్తదో తెలీదు కానీ..ఇక్కడ మాత్రం చాలా ట్రెడిషనల్ లుక్ తో చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. కచ్చితంగా ఆమెకు టాలీవుడ్ లో మంచి భవిషత్తు ఉండే అవకాశం ఉంది.
- Tags
- శివాని
Next Story


