శాతకర్ణిగా బాలయ్య ఠీవి సూపర్బ్

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలక్రిష్ణ చేస్తున్న 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందతున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించి.. విజయదశమి నాడు.. ఉదయం 10.15 గంటలకు టీజర్ విడుదల కానుంది.
ఆ సందర్భంగా.. ఒక వాల్ పోస్టర్ విడుదల చేశారు. అందులో బాలక్రిష్ణ , శాతకర్ణి గా సింహాసనం మీద కొలువుదీరి ఉన్న భంగిమలోని ఠీవి సూపర్బ్ అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. టీజర్ కుసంబంధించిన పోస్టరే అదిరిపోయేలా ఉన్నదని.. ఇక టీజర్ కూడా వచ్చిందంటే.. పండగే పండగ అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
బాలకృష్ణ 100 వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చిత్రం క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని దసరా కానుకగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. ఇక ఈ ప్రకటనతో బాలకృష్ణ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే అభిమానుల సంబరాలు దసరా కన్నా ముందే జరుపుకోవాలని భావించిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' యూనిట్ బాలకృష్ణ లుక్ ని రిలీజ్ చేసేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ శ్రీయ లుక్ ని ఇప్పటికే విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు తాజాగా బాలకృష్ణ లుక్ ని కూడా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్ర యూనిట్ విడుదల చేసేసింది. ఇక ఈ ఫొటోలో బాలకృష్ణ ఒక బంగారు సింహాసనంపై కూర్చుని సింహం నెత్తిన చెయ్యి పెట్టి రాజాసనం ఉట్టిపడేలా ఈ లుక్ ని తయారు చేశారు. అసలు రాజుగారు అంటే ఇలానే ఉంటాడా అని అనిపించేలా బాలకృష్ణ ఈ లుక్ లో అదరగొడుతున్నాడు. ఇక ఈ చిత్రం టీజర్ ని విజయదశమి రోజున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ బాలకృష్ణ లుక్ తో సంబరాలు చేసుకుంటున్న నందమూరి అభిమానులు ఇక వచ్చే టీజర్ తో ఇంకెంత సంబరాలు చేసుకోవడానికి రెడీ అవుతారో మరి. ఈ సినిమాలో బాలకృష్ణ కి జోడిగా శ్రీయ నటిస్తుండగా.... రాజమాతగా బాలీవుడ్ నటి హేమ మాలిని నటిస్తుంది.

