వెరైటీ పాత్రలు లేక వెరైటీ గెటప్స్ తో సరిపెట్టుకుంటుంది పాపం

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై తెలుగు లో రెండవ చిత్రం కూడా పాపులర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో ప్రధాన కథానాయిక కానప్పటికీ చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ వున్న పాత్రలో కనిపించి మెప్పించిన భామ అదా శర్మ. టాలీవుడ్ లో కెరీర్ ఆరంభంలోనే ఇద్దరు పెద్ద దర్శకుల చిత్రాలలో నటించిన అదా శర్మ తన కెరీర్ ని సరైన మార్గంలో ముందుకు సాగించటంలో మాత్రం విఫలమైంది.
అప్పటికే ప్రేక్షకులకి రిజిస్టర్ ఐన కథానాయిక ఎవరూ ఒప్పుకోని పాత్రని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం కోసం ఒప్పుకుని తొలి తప్పటడుగు వేసిన ఆదా శర్మ, వెంటనే అటు యాక్టింగ్ స్కోప్ కానీ ఇటు గ్లామర్ షో కి కానీ ఎలాంటి ఆస్కారం లేని, పైగా అగ్ర నిర్మాణ సంస్థ కానీ అగ్ర దర్శక కథానాయకులు కానీ లేని గరం చిత్రంలో కనిపించి మరో తప్పు చేసిన అదా శర్మకి మంచి టర్నింగ్ పాయింట్ గా క్షణం చిత్రం తారసపడింది. ఆ చిత్రంతో మంచి గుర్తింపు తెచుకున్నప్పటికీ ఆ గుర్తింపు ని తదుపరి అవకాశాలుగా మలచుకోవటంలో మరొక సారి విఫలమై గత ఏడాది ఒక్క తెలుగు చిత్రంలో కూడా కనిపించకుండా పోయింది ఈ భామ. అయితే తనలోని అంధ చందాలని వెండితెరపై ప్రదర్శించలేనప్పటికీ రకరకాల గెటప్ లలో ఫోటోషూట్స్ రూపంలో ఎప్పటికప్పుడు దర్శక నిర్మాతల దృష్టిలో పడేలా ప్లాన్ చేసుకుంటూనే వుంది. తాజాగా విదేశీ యువతిని తలపించే ఒక గెటప్ లో తన నడుము ఒంపుల సోయగాలని ఒలకపోస్తూ ఇలా కెమెరా కి ఫోజు ఇచ్చింది ఆదా శర్మ.


