వెన్నెలని ఏడిపించిన టాప్ హీరోయిన్

సినిమా పరిశ్రమలో తాము ఏం చేస్తున్నామో ఎప్పటికప్పుడు నటీనటులు సాంఘిక మాధ్యమాల ద్వారా అభిమానులకి చేరవేసేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో తమ స్టేటస్ ని ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేసే వారందరిలో సమంత రౌత్ ప్రభు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడూ సాంఘిక మాధ్యమాలలో సందడి చేసే సమంత తనకు కాబోయే భర్త నాగ చైతన్య కు సంబందించినవి.... అలాగే అక్కినేని కుటుంబానికి సంబందించిన అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తుంటుంది. ఇక సమంత ట్వీట్స్ కి చాలామంది అభిమానులే ఉన్నారు. ఆమె చేసే ప్రతి ట్వీట్ ని ఆసక్తిగా అభిమానులు తిలకిస్తూనే వుంటారు.
ఇప్పుడు తాజాగా సమంత ట్విట్టర్ లో చేసిన అల్లరి మరోసారి హైలెట్ అయ్యింది. అదేమిటంటే హాస్య నటుడు వెన్నెల కిషోర్ ఫన్నీ ట్వీట్ ని సమంత కూడా ఫన్నీగా రీ ట్వీట్ చేసింది. వెన్నెల కిశోర్ ని ఏడిపిస్తూ సమంత చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సాంఘిక మాధ్యమాలలో దావానలంలా వ్యాపించింది. వెన్నెల కిశోర్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పిక్ పోస్ట్ చేశాడు. ఆ పిక్ లో వెన్నెల కిశోర్ తన కనుబొమ్మలు పైకి లేపి చాలా చాల సరదాగా ఫేస్ పెట్టాడు. అయితే సమంతకి వెన్నెల కిషోర్ పెట్టిన ఆ పిక్ బాగా నచ్చడంతో రీట్వీట్ చేస్తూ ఆటపట్టించింది. సమంత, వెన్నెలని ఉద్దేశించి 'వావ్.. నువ్వు చాలా చాలా అందంగా కనిపిస్తున్నావు.. నువ్వే నీ ఐ బ్రోస్ చేసుకున్నావా?.. నువ్వు లిప్ స్టిక్ కూడా పెట్టుకుంటావా?’ అంటూ సరదాగా వెన్నలని రీ ట్వీట్ చేస్తూ ఏడిపించింది.
మరి సమంత ఫన్నీ రీట్వీట్ కి వెన్నెల కిషోర్ ఎలా ఫీల్ అవుతున్నాడో గాని.... సమంత చేసిన ఈ ట్వీట్ అందరికి తెగ నచ్చేసింది.

