Tue Dec 23 2025 15:49:04 GMT+0000 (Coordinated Universal Time)
వాయిదా: ‘ఇంట్లో దెయ్యం...’ దేనికి భయపడ్డదో మరి!

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్టైన్ చేశాయి. వీరిద్దరి కాంబినేషన్లో అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పి పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్ ఎంటర్టైనర్ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కావాల్సి వుంది. అయితే ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ''నవంబర్ 12న విడుదల కావాల్సిన మా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రాన్ని ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం'' అన్నారు.
అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్, ధన్రాజ్, ప్రగతి, రజిత, అమిత్, టార్జాన్, జయవాణి, అపూర్వ, ఆజాద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, డాన్స్: రాజుసుందరం, గణేష్, దినేష్, ఫైట్స్: సుంకర రామ్, ఆర్ట్: నారాయణరెడ్డి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.
Next Story

