వర్మ పైత్యానికి పరాకాష్ట

రామ్ గోపాల్ వర్మ గురించి ఏం చెప్పాలి. ఒక రాజకీయకుడికన్నా, ఒక స్టార్ హీరోకన్నా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. సోషల్ మీడియాలో తన పైత్యాన్ని చూపిస్తూ రోజు ఏదో ఒక విషయమై హైలెట్ అవుతూనే ఉన్నాడు. నిన్నటివరకు ఎన్టీఆర్ జీవితం గురించిన వ్యాఖ్యలతో జనాలకు పిచ్చెక్కిస్తున్న వర్మ తాజాగా నాగ్ తో తాను తియ్యబోయే యాక్షన్ సినిమా గురించిన విషయాలతో వెర్రెక్కిస్తున్నాడు. శివ కి సీక్వెల్ గా చేస్తున్న ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తుండగా... ఈ సినిమాని నవంబర్ 20 న మొదలు పెట్టనున్నారు. వర్మ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అప్పుడే ఫుల్ పబ్లిసిటీని మొదలెట్టేసాడు.
అందులో భగంగాం ఈయన తల్లి తండ్రుల గురించి ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్ లు చేసాడు. తను డైరెక్టర్ అవుతానన్న నమ్మకం తన తండ్రికి అసలు ఎప్పుడూ ఉండేది కాదన్నాడు. ఆయన తాను నాగ్ తో సినిమా చేస్తున్నాను అంటే అస్సలు నమ్మలేదని... తన మీద నమ్మకం రావడం కోసం శివ సినిమాకు తొలి క్లాప్ తన తండ్రితోనే కొట్టించానని చెప్పడమే కాదు.... ఆయనపై తాను ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నానని పోస్ట్ చేసాడు. అప్పట్లో.... నాగార్జున - అమల జంటగా నటించిన వారిపై 1989 ఫిబ్రవరి 16న ముహూర్తం షాట్‌కి క్లాప్ కొట్టారు వర్మ తండ్రి కృష్ణంరాజు. అలాగే తన తల్లి కూడా తాను ప్రతీకారం తీర్చుకోబోతున్నట్లుగా చెప్పాడు.
అందుకే ఈసారి తన కన్న తల్లి సూరమ్మ తో శివ కి సీక్వెల్ గా తెరకెక్కబోయే ఈ సినిమాకి తొలి క్లాప్ కొట్టిస్తానని చెబుతున్నాడు. ఆవిధంగా ఆమెతో తోలి షాట్ కి క్లాప్ కొట్టించి తన ప్రతీకారం తీర్చుకుంటానని.. వర్మ పోస్ట్ చేసాడు. మరి నాగార్జున - వర్మ సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ బాగానే చేస్తున్నాడు గాని.. ఈ సందర్భంలో తల్లితండ్రులపై పగా ప్రతీకారాలంటూ వెటకారంగా పోస్ట్ లు చేయడంపై నెటిజెన్ల మండిపడుతున్నారు.

