వర్మ - నాగ్ సినిమాలో అది ఉండదా?

నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కలయికలో ఒక యాక్షన్ సినిమా తెరకెక్కుతుంది. నిన్నగాక మొన్న షూటింగ్ మొదలెట్టిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం 10 రోజులపాటు శరవేగంగా జరుగుతుంది. మద్యలో నాగ్ కి తన రెండో కొడుకు అఖిల్ హలో సినిమా విడుదల ఉండడంతో. ఒక 20 రోజుల గ్యాప్ తో మరలా వర్మ సినిమా షూటింగ్ కి షిఫ్ట్ అవుతాడు నాగ్. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో నాగ్ సరసన హీరోయిన్ గా అనుష్క నటిస్తుందని టాక్ ఉంది. మరి వర్మ సినిమా అంటే కాసింత యాక్షన్ తోపాటు... కాసింత రొమాన్స్ కూడా ఉంటుంది.
అయితే ఇప్పుడు నాగ్ - వర్మ సినిమా మీద కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదేమిటంటే వర్మ - నాగ్ సినిమాలో రొమాన్స్ కి అస్సలు చోటుండదట. అలాగే ఈ సినిమాలో అసలు పాటలే ఉండవట. ఒకవేళ ఉన్నా ఒకటి రెండు పాటల మినహా ఇంక పాటలే ఉండవట. అసలు హీరోహీరోయిన్స్ మద్యన రొమాన్స్ అనే పదానికే చోటుండదట. మరి ఇక హీరోయిన్ ఉండి ఉపయోగం ఏమిటి అనుకుంటున్నారా. అయితే వర్మ - నాగ్ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఈ సినిమాలో నాగ్ పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ పాత్రకి అంతే ప్రాధాన్యత ఉంటుందట.
అయితే ఈసినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రేమించాలన్న ఆలోచనే ఉండదట. ఇకపోతే ఈసినిమాలో నాగ్ కి సంబందించిన షూటింగ్ మొత్తం ముంబై పరిసరప్రాంతాల్లో జరుగుతుందట. ఇక హీరోయిన్ షూటింగ్ మాత్రం జనవరి లో గాని, ఫిబ్రవరిలో గాని ఉంటుందట. అందుకే ఈలోపు డైరెక్టర్ వర్మ ఈ సినిమాలో నటీనటులకు కావాల్సిన కాస్టూమ్స్ సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడట. ఇకపోతే ప్రస్తుతం హైద్రాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఒక 20 రోజుల పాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేసి తర్వాత ముంబై కి పయనమవుతుందట.

