వచ్చిన అవకాశాన్ని కావాలని వదిలేసుకుంది

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ పరిచయం అక్కర్లేని హీరోయిన్. ఎందుకంటే ఈ మలయాళ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి డీసెంట్ హిట్స్ కొడుతూ పద్దతిగల హీరోయిన్ గా పేరు కొట్టేసింది. అ.. ఆ, ప్రేమమ్, శతమానంభవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాల్లో డీసెంట్ లుక్స్ తో అదరగొట్టిన అనుపమకు ఉన్నది ఒకటే జిందగీ తర్వాత బోలెడన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే అనుపమాకొచ్చిన ఒక పెద్ద బ్యానర్ లో సినిమాని అనుపమ చేజార్చుకుందనే న్యూస్ వైరల్ అయ్యింది.
టాలీవుడ్ లో టాప్ బ్యానర్ లో ఒక మంచి దర్శకుడితో.. పెద్ద సినిమాలో నటించే అవకాశం అనుపమ తలుపు తట్టిందట. అయితే ఆ సినిమా కథ లో హీరోయిన్ పాత్ర చివరికి విషాదాంతం అవడంతో అనుపమ మారుమాట్లాడకుండా నో చెప్పేసిందట. ఆ పాత్ర తీరు తెన్నులు ఎంతో గొప్పగా ఉన్నా కూడా... ఆ పాత్ర చివరిలో విషాదాంతం అవడమనేది అనుపమకు నచ్చలేదంటున్నారు. ఎందుకంటే అనుపమ పరమేశ్వరన్ తాజా చిత్రం ఉన్నది ఒకటే జిందగీలో కూడా ఇంటెర్వెల్ టైం కి ఆమె చనిపోయిన పాత్రలో కనబడింది.
అందుకే మల్లి వెంటనే ఇలాంటి పాత్ర వచ్చేసరికి వద్దనేసిందట. ఎందుకంటే వెంటవెంటనే ఇలాంటి పాత్రలు చేసుకుంటూ వెళితే తన ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉండడం...వలెనే అనుపమ నో చెప్పిందంటున్నారు. ఒకవేళ ఈ పాత్ర తన తలుపు తట్టకముందు ఏదన్న ఒక సినిమాలో ఫుల్ లెంత్ హీరోయిన్ పాత్ర చేసుంటే గనక ఈ సినిమాకి ఒకే చెప్పేది అనుపమ అంటున్నారు అనుపమ సన్నిహితులు. ఏది ఏమైనా ఈ సినిమాని అనుపమ చేజేతులా చేజార్చుకుందంటున్నారు కొందరు.

