లాస్ట్ కి అదే సెట్ అయ్యేలాగా వుంది

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న పవన్ 25 వ చిత్రం మీద భారీ అంచనాలే వున్నాయి. పవన్ ఫాన్స్ కూడా ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతోనే ఈ సినిమాపై ఇన్ని అంచనాలు కారణం. ఇకపోతే కాన్సెప్ట్ పోస్టర్ తోనూ, మ్యూజికల్ బిట్ తోనూ ఆకట్టుకున్న పవన్ చిత్రం టైటిల్ ని విడుదల చెయ్యకుండా ఇంకా తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు చిత్ర బృందం. దసరాకి పవన్ 25 వ చిత్ర టైటిల్ బయటికొస్తుంది అనుకుంటే అది రాలేదు. ఇక ఇప్పుడు మాత్రం దీపావళికి పవన్ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ గ్యారెంటీ అంటూ వార్తలొస్తున్నాయి.
అలాగే మొన్నామధ్య నుండి అనుకున్న విధంగానే పవన్ - త్రివిక్రమ్ చిత్రానికి అజ్ఞాతవాసి టైటిల్ నే చిత్ర బృందం కూడా ఫైనల్ చేసేటట్టు కనబడుతుంది. ఎందుకంటే అజ్ఞాతవాసి టైటిల్ ని చిత్ర బృందం ఇంట్రెస్టింగ్ గా పరిశీలించడమే కాదు.. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించింది. మరి నిర్మాతలు హారిక అండ్ హాసిని కియేషన్స్ వారు కూడా అజ్ఞాతవాసి టైటిల్ కె కనెక్ట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక ఈ టైటిల్ ఇప్పటికే జనాల నోళ్ళలో బాగా నాని నాని ఉంది కాబట్టి ఫైనల్ గా ఇదే టైటిల్ ని చిత్ర బృందం కూడా రివీల్ చేస్తుందని అంటున్నారు.
ఇక ఈ టైటిల్ కూడా కథకు అనుగుణం ఉంటుందనే టాక్ మొదటినుండి ఉంది. అయితే ఇదే అజ్ఞాతవాసి టైటిల్ కి పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని అంటున్నారు. మరి కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ తో రొమాన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిగా ఎలా ఆకట్టుకుంటాడో చూద్దాం.

