లావణ్య లక్కీ ఛాన్స్ కొట్టేసింది

హిట్.. ప్లాపులు పక్కన పెడితే సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అసలు ఖాళీ లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఉండాలి. కొన్ని కొన్ని సార్లు ఆఫర్ చేయి జారిపోయినా అది మన మంచికే అని కొందరు నమ్ముతారు. అదే మన లావణ్య త్రిపాఠి విషయంలో నిజమయ్యింది.
టచ్ చేసి చూడు సినిమాలో రవి తేజ పక్కన రాశి ఖన్నాకి ముందు లావణ్యనే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్ అవ్వలేదు. ఒకందుకు అది మంచిదే అయింది. ఎందుకంటే సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఆఫర్ పోవడం వల్లనే లావణ్యకు ఇంకో మంచి ఆఫర్ వచ్చింది. అదెలా అంటారా.. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఇప్పుడు రవితేజ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటివరకు రవితేజ పక్కన నటించని హీరోయిన్ మాత్రమే కావాలి అని వెతికితే లావణ్య కనిపించింది.
వెంటనే డైరెక్టర్ ఆమెకు స్టోరీ చెప్పగానే టక్కున ఒకే చేసేసింది లావణ్య. అసలు చేతిలో ఏ సినిమాలు లేవు. చేసిన ప్రతీ సినిమా ప్లాపులు అవుతున్నాయి. ఇక వచ్చిందే అవకాశం అనుకుని లావణ్య ఆ డైరెక్టర్ ఒకే చెప్పేసింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కళ్యాణ్ కృష్ణ సినిమా తర్వాత ఈ సినిమా వుండే అవకాశంవుంది.

