లక్ష్మి రాయ్ అందాల విందు

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమెకి సరైన బ్రేక్ రాక సెకండ్ హీరోయిన్ పాత్రలకి, స్పెషల్ సాంగ్స్ కి ఫిక్స్ అయిన అమ్మడు లక్ష్మి రాయ్ కి బాలీవుడ్ లో ఒక ఆఫర్ తగిలింది. మరి బాలీవుడ్ లోకి అడుగు పెట్టాక సౌత్ లాగ... మడి కట్టుకుని కూర్చుంటే సరిపోదు కదా అందుకే లక్ష్మి రాయ్ అందాల ఆరబోతకి లెక్క లేకుండా రెచ్చిపోయింది. 'జూలీ' కి సీక్వెల్ గ తెరకెక్కుతున్న 'జూలీ 2 ' లో లక్ష్మి రాయ్ అందాల ఆరబోత బాలీవుడ్ ని షేక్ చేయబోతుంది. టీజర్ లోనే లైట్ గా అందాల ఆరబోతని పరిచయం చేసిన లక్ష్మి రాయ్ ఇప్పుడు ట్రైలర్ లో ఆ గ్లామర్ షోకి బాలీవుడ్ జనాలే కాదు సౌత్ ప్రేక్షకులు కళ్ళొదిలేశారు.
లక్ష్మి రాయ్ అంగాంగ ప్రదర్శన, బికినిలో మెరుపులో, సన్నని నాజూకు నడుముకు ఇప్పుడు అందరూ మతులుపోగెట్టేసుకుంటున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే ఇలాంటి గ్లామర్ షోతో తో మత్తెక్కిస్తుంటే ఇప్పుడు ఒక సౌత్ హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్స్ ని మించిపోయేలా ఎక్సపోజింగ్ చెయ్యడం చూస్తుంటే అక్కడి హీరోయిన్స్ కూడా నోరెళ్లబెట్టిస్తున్నారట. సినీ పరిశ్రమ నేపథ్యంలో ఉండే అమ్మాయి ఆ సినిమా రంగంలో ఎదుర్కునే ఒడిదుడుకులు, ఒక నటిగా ఎదగడానికి గల దారులు, అడ్డదారులు వెతుక్కునే ఎక్స్ప్లాయిటేషన్కి గురయ్యే వర్ధమాన నటిగా కనిపిస్తోంది లక్ష్మి రాయ్.
మరి ఒకే ఒక్క ట్రైలర్ తోనే బాలీవుడ్ మొత్తాన్ని తనవైపు తిప్పేసుకుంది లక్ష్మి రాయ్. సౌత్ లో ఎప్పుడు ఈ రేంజ్ లో రెచ్చిపోని రత్తాలు ఇప్పుడు బాలీవుడ్ కోసం ఇంతటి ఎక్సపోజింగ్ కి దిగింది అంటే అదంతా బాలీవుడ్ మహిమే అంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఇకపోతే 'జూలీ 2 ' సినిమా విడుదలై నెగెటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ కుమ్మేస్తాయని.... కారణం మాత్రం లక్ష్మి అందాల విందే అంటున్నారు.