Tue Jan 20 2026 21:31:59 GMT+0000 (Coordinated Universal Time)
రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు!
కథానాయకుడు రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న ఇంతవరకు మహానాయకుడు పై ఎటువంటి అంచనాలు లేవు. కారణం మొదటి పార్ట్ డిజాస్టర్ కావడమే. మొదటి పార్ట్ హిట్ [more]
కథానాయకుడు రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న ఇంతవరకు మహానాయకుడు పై ఎటువంటి అంచనాలు లేవు. కారణం మొదటి పార్ట్ డిజాస్టర్ కావడమే. మొదటి పార్ట్ హిట్ [more]

కథానాయకుడు రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న ఇంతవరకు మహానాయకుడు పై ఎటువంటి అంచనాలు లేవు. కారణం మొదటి పార్ట్ డిజాస్టర్ కావడమే. మొదటి పార్ట్ హిట్ అయి ఉంటె వేరే విధంగా ఉండేది. కానీ అలా జాగరలేదు . మహానాయకుడు రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు.మొదట ఫిబ్రవరి 7 అన్నారు తరువాత 15కి వెళ్లింది, ఇప్పుడు 21 అంటున్నారు. అయితే ఇప్పటివరకు రిలీజ్ డేట్ ఎప్పుడో మాత్రం మేకర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
పైగా మహానాయకుడు కి సంబంధించి 12 రోజులు షూటింగ్ ఉందని కథానాయకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. అయితే ఇంతవరకు ఆ షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా జరుగుతూనే ఉంది. మధ్యమధ్యలో బ్రేకులు పడడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోంది. కొన్ని భారీ సీన్స్ జనల మధ్య తీయాల్సిఉంది. కానీ వాటిని బడ్జెట్ తగ్గించాలన్న ఉద్దేశ్యంతోనో, తొందరగా చుట్టేయాలన్న ఆలోచనతోనో పైపైనే కానిచ్చేస్తున్నార్ట.
కథానాయకుడు రిజల్ట్ మహానాయకుడు పై భారీగా పడినట్టు అర్ధం అవుతుంది. ఈ నెలాఖరు వరకు షూటింగ్ జరిగి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేదు. మొదటి పార్ట్ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కె రెండో పార్ట్ ఇవ్వనున్నారు.
- Tags
- NTR Mahanayakudu
Next Story
