రికార్డుకి దగ్గరలో 'జై లవకుశ'

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ 'జై లవకుశ'. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం... చూసిన ప్రతి ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో తారక్ ట్రిపుల్ రోల్ లో నటవిశ్వరూపాన్ని చూపించాడు. 'జై, లవ, కుశ' పాత్రల్లో తారక్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ముఖ్యంగా జై పాత్రకు జనాలు పొగడ్తలతో ముంచేత్తారు. సినిమా మొదటి రోజు నుండే హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా దుమ్ములేపింది.
'జై లవ కుశ' ఈ రోజుకి 50 రోజులు సక్సెస్ ఫుల్ పూర్తి చేసుకుంది. అయితే తారక్ కు ఇప్పుడు ఓ సమస్య ఎదురైంది. సింగల్ థియేటర్ లిస్ట్ లో తారక్ ఇంకా కోటి కొట్టలేదు. ఇప్పుడు ఆ సమస్యే అతడిని పీడిస్తుంది. టాలీవుడ్ లో రికార్డ్స్ నెలకొల్పే ఏరియాల్లో హైదరాబాద్ లోని RTC X రోడ్స్ ముఖ్యమైనిది. ఆ ఏరియాలో ఇప్పటివరకు పెద్ద హీరోలు అందరూ సింగల్ థియేటర్ లో కోటి గ్రాస్ కలెక్షన్ రాబట్టారు. కానీ తారక్ మాత్రం ఇంకా ఆ ఫీట్ ను సాధించలేదు.
తాను నటించిన 'సింహాద్రి' 80 లక్షల గ్రాస్ ను, 'నాన్నకు ప్రేమతో' 86 లక్షల గ్రాస్ ను, 'జనతా గ్యారేజ్' 91 లక్షల గ్రాస్ ను రాబట్టింది. అయితే లేటెస్ట్ గా తారక్ నటించిన 'జై లవకుశ' మాత్రం 98.9 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. మరి ఈ క్రమంలో మరో లక్ష రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేస్తే 'జై లవకుశ' సినిమా సింగల్ థియేటర్ లో కోటి రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసిన చిత్రంగా నిలుస్తుంది

