రామ్ చరణ్ కి కోపం వచ్చింది

చిరంజీవి 151 వ చిత్రం మొదలు పెట్టడానికి నిర్మాత రామ్ చరణ్, హీరో చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి లు చాలా టైం తీసుకున్నారు. ముందు నుండి ఈ చిత్రం ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోందని చెబుతూ వచ్చారు. ఫైనల్ గా చిరు 151 వ చిత్ర టైటిల్ కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగానే ఉండబోతోందనే ప్రచారం జోరుగా జరిగింది. ఇక సినిమా కూడా ఆగష్టు 22 చిరు పుట్టిన రోజు న మొదలవుతుందని అన్నారు. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం సైలెంట్ గా సినిమాని ముందే పూజ కార్యక్రమాలతో ప్రారంభించేసి.. సినిమా టైటిల్ మరియు మోషన్ పోస్టర్ మాత్రం గ్రాండ్ గా లాంచ్ చేస్తామని ప్రకటించింది. ఇక సినిమా టైటిల్ లాంచ్ వరకు సినిమా పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అయినా... లేకుంటే మహావీర అనే టైటిల్స్ నే అనుకున్నారు జనాలు. కానీ అనూహ్యంగా సినిమా టైటిల్ సై రా నరసింహారెడ్డి అంటూ రివీల్ చెయ్యడమే కాక సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలు కూడా అందించారు. ఏ విషయంలోనూ తొందరపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని చిన్న క్లూ కూడా ఇవ్వకుండా టైటిల్, నటుల పేర్లు వెల్లడించారు.
అయితే ఇప్పుడు ఎంత పకడ్బందీగా ఈసినిమా గురించి దాచి పెట్టాలన్న ఏదో ఒక విషయం బయటికి వచ్చేస్తుందట. మరి అన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నప్పటికీ 'సై రా' లో నటించే నటుల పాత్రలకు సంబందించిన విషయాలు బయటికి రావడంతో ఖంగుతిన్న దర్శకుడు సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ దగ్గర చెప్పగా... చరణ్ ఈ విషయమై కాస్త సీరియస్ గానే ఉన్నాడట. అసలు ఈ లీకులు ఎక్కడినుండి బయటికి వస్తున్నాయో చూడాలని చిత్ర బృందానికి గట్టిగా చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి కేవలం పాత్రల వరకు రివీల్ అయితే ఒకే గాని కథ ఏమన్నా చిన్నగా లీక్ అయితే మాత్రం చాల కష్టం కదా. అందుకే ఉయ్యాలవాడ చరిత్ర గురించి ఇండియా వైడ్ గా ఎవ్వరికి పెద్దగా తెలియదు గనక ఈ సినిమా స్టోరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని ఇండియా మొత్తం విడుదల చేసే ప్లాన్ లో ఉండగా ఇలా చిన్న చిన్న లీకుల వలన ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు.
ఇక ఈ సినిమాలో నటించే నటీనటులు పాత్రలు విషయాలు ఎక్కడనుండి లీక్ అవుతున్నాయో... ఎవరు లీక్ చేస్తున్నారో అనే విషయాన్ని దీర్ఘంగా శోధిస్తే.. ఈ లీకులు సై రా రైటర్స్ నుండే లీక్ అయ్యి ఉండాలని... లేకపోతె నటులు పోషించే పాత్రల వివరాలు ఇంకెవరు లీక్ చేస్తారంటున్నారు. మరి ఈ విషయమై కోపంగా ఉన్న చరణ్ ఆ లీకులపైనా కన్నేసి ఉంచమని తన సన్నిహతులకు చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.