రామ్... 'ఉన్నది ఒకటే జిందగి' వీకెండ్ కలెక్షన్స్

రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన 'ఉన్నది ఒకటే జిందగీ' అంచనాలకు తగ్గట్టుగానే థియేటర్స్ లో రన్ అవుతుంది. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఎంటర్టైనర్ చేసింది. స్నేహం, ప్రేమ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన కలెక్షన్స్ ని నమోదు చేస్తుంది. రామ్ కెరీర్ లోనే మొదటిరోజు కలెక్షన్స్ అత్యధికంగా రావడమే కాదు రెండో రోజు కూడా ఈ సినిమా కలెక్షన్స్ బావున్నాయంటున్నారు. మొదటివారంతంలో 'ఉన్నది ఒకటే జిందగీ' 10.93 కోట్ల షేర్ కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.
ఏరియాల వారీగా కలెక్షన్స్ వివరాలు కోట్లలో
నైజామ్: 3 .79
సీడెడ్: 1 .41
ఉత్తరాంధ్ర: 1 .14
గుంటూరు: 0 .75
కృష్ణ: 0 .67
తూర్పు గోదావరి: 0 .64
పశ్చిమ గోదావరి: 0 .48
నెల్లూరు: 0 .25
ఏపీ మరియు తెలంగాణ కలిపి 9 .13 కోట్లు
ఓవర్సీస్ 0 .95
రెస్ట్ అఫ్ ఇండియా: 0 .85
టోటల్ వరల్డ్ వైడ్: 10 .93 కోట్లు

