రాజు గారు అలా చెప్పలేదంట!!

టాలీవుడ్ లో కొత్త డైరెక్టర్స్ ని పరిచయం చెయ్యాలన్నా, సినిమా కథని నమ్మి సినిమాని నిర్మించాలన్నా, ఎంతో కాలిక్యులేటెడ్ గా సినిమా చెయ్యాలన్నా అది ఒక్క దిల్ రాజుకే చెల్లింది. ఆయన నిర్మాణంలో వచ్చే సినిమాపై ఎంతో నమ్మకంతోనే సినిమాకు పెట్టుబడి పెడుతూ.... ఆ సినిమా విడుదలకు ముందే లాభాలు జేబులో వేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. అసలు దిల్ రాజు నిర్మాతగా ఏదన్నా సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై భారీ అంచనాలే ఉంటాయి. అది డైరెక్ట్ తెలుగు సినిమా అయ్యుండొచ్చు లేకుంటే ఏదన్న డబ్బింగ్ సినిమానైనా అయ్యుండొచ్చు. ఆయన నిర్మాణంలో సినిమా అంటే ప్రేక్షకులకు అంత నమ్మకం. అలాంటి దిల్ రాజు సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి విషయంలో బాగా ఇబ్బంది పడ్డాడు.
అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా తన నిర్మాణంలో వచ్చిన డీజే విషయంలోనూ మాటలు పడుతున్నాడు. డీజే కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ అంటూ మెగా ఫాన్స్ రచ్చ రచ్చ చేశారు. అయితే ఇపుడు దిల్ రాజు ఫిదా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డీజే కలెక్షన్స్ మీద స్పందించాడు. తన నిర్మాణంలో వచ్చిన ఏ సినిమా విజయం సాధించినా ఖచ్చితంగా వారం రోజుల్లోనే సక్సెస్ మీట్ నిర్వహిస్తాను. నేను కేవలం నిర్మాతగా మాత్రమే ఆలోచించను... నేను డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుండి కూడా ఆలోచిస్తా. ఎందుకంటే నేను ఒక డిస్ట్రిబ్యూటర్ నే గనక. కొన్ని ఏరియాలు నేను డిస్ట్రుబ్యూట్ చేస్తా. అలాగే ఒక సినిమా గురించి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానంటే అది ఫేక్ స్టేట్మెంట్ అవదు. అలాంటి ఫేక్ స్టేట్మెంట్స్ నేను ఇవ్వను.
సినిమా గనక సక్సెస్ అవ్వకపోతే మీడియా ముందుకు వచ్చి ఆ సినిమా సక్సెస్ అయ్యిందని ఎలా చెబుతాను. కొన్ని సినిమాలు హిట్ అంటే అది మార్నింగ్ షో కె తెలుస్తుంది. కొన్ని సినిమాలు హిట్ అవడానికి నాలుగైదు రోజులు పడుతుంది. అలాగే అల్లు అర్జున్ సరైనోడు చిత్రం అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. మరి సరైనోడు కలెక్షన్స్ ని డీజే దాటేసింది అంటే డీజే కూడా హిట్టే కదా.. డీజే కలెక్షన్స్ విషయంలో మీడియాకి తప్పుడు ఫిగర్స్ ఇచ్చామంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత అన్ని ఏరియాల నుండి గ్రాస్.. షేర్ తెప్పించుకుని అన్ని సరిచూసుకుని అందరికి పంపించాం.
కలెక్ట్ చేసిన కలెక్షన్స్ కి ఇంకా కొంత యాడ్ చేసి చూపించాల్సిన అవసరం ఏముంటుంది. అసలు అలాంటివి ఇప్పటివరకు నేను చెయ్యలేదు. ఇక ముందు కూడా చెయ్యను. అలా గనక చేస్తే మిమ్మల్ని మోసం చెయ్యడం కాదు... మమ్మల్ని మేమె మోసం చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పాడు. అలాగే రాబోయే పెద్ద మూవీస్ మహేష్ స్పైడర్, ఎన్టీఆర్ జై లవ కుశ, పవన్ న్యూ మూవీ లను మేమె విడుదల చేయబోతున్నాం. ఒక్క హీరోకి ఫేక్ ఫిగర్ చెబితే అది రాబోయే పెద్ద హీరోలమీద ప్రభావం తప్పక ఉంటుంది అంటూ పేద క్లాస్ ఇచ్చాడు. ఇంతకీ ఈ క్లాస్ మీనింగ్ డీజే హిట్ అనేది దిల్ రాజు ప్రత్యక్షంగా చెప్పినట్టే అంటున్నారు.

