రాజా ది గ్రేట్ రెండు తెలుగు రాష్ట్రాల ఫైనల్ వసూళ్లు

రాజా ది గ్రేట్ సినిమా విడుదలవడం హిట్ కొట్టడం జరిగిపోయాయి. రవితేజ అంధుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా క్యూటీ లుక్స్ తో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను అప్పుడే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో కూడా పెట్టేశారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజా ది గ్రేట్ ఫైనల్ రన్ పూర్తిచేసుకోవడంతో ఇలా ఇంటర్నెట్ లో సినిమాను అప్ లోడ్ చేశారు. ఇకపోతే ఓవర్సీస్ లో అయితే ఎప్పుడో రాజా ది గ్రేట్ మూటాముల్లె సర్దుకుంది. ఇక ఈ సినిమా ఫైనల్ రన్ లో 27 కోట్ల రూపాయల షేర్ సాధించగలిగింది. జస్ట్ 18 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. నిర్మాత దిల్ రాజుకు బాగానే లాభాలు తెచ్చిపెట్టింది. మరి రాజా ది గ్రేట్ రెండు తెలుగు రాష్ట్రాల ఫైనల్ షేర్ మీకోసం.
ఏపీ, నైజాంలో ఫైనల్ వసూళ్లు (కోట్లలో)
నైజాం - 11. 15
సీడెడ్ - 4.22
ఉత్తరాంధ్ర - 4
ఈస్ట్ - 2.05
గుంటూరు - 1.88
వెస్ట్ - 1.65
కృష్ణా - 1.82
నెల్లూరు - 0.93
ఏపీ - నైజం లో మొత్తం వసూళ్లు 27.7 కోట్లు

